రాష్ట్రంలో వైసీపీ పతనానికి కారణమైన వైస్ జగన్ మోహన్ రెడ్డి తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి ఒక్కో నియోజకవర్గం మీద సమీక్షలు నిర్వహించి పార్టీ క్యాడర్ తో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఇందులో భాగంగా తానూ ప్రస్తుతం నివాసముంటున్న తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కర్తలతో కూడిన ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసారు.
రాష్ట్రానికి అత్యంత కీలక స్థానమైన మంగళగిరిలో తిరిగి వైసీపీ ని బలోపేతం చేసేందుకు స్థానిక నాయకుడైన దొంతి రెడ్డి వేమా రెడ్డిని పార్టీ సమన్వయ కర్తగా నియమించారు జగన్. అయితే గత ఐదేళ్లు వైసీపీ ఎమ్మెల్యే గా గెలిచిన ఆళ్ల రామకృష్ణా రెడ్డిని కాదని జగన్ వేమా రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించడం పై స్థానికంగా కొన్ని గుసగుసలు వినపడుతున్నాయి.
పార్టీ అధికారంలో ఉంటే ఆ రెడ్డి గారు (ఆర్కే), ప్రతిపక్షంలో ఉంటే ఈ రెడ్డి (వేమా రెడ్డి) గారు అంటూ సొంత పార్టీ క్యాడర్ నుండే విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి వెంటిలేటర్ మీద ఉన్న ఫేషేంట్ మాదిరి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
అటు బతుకుతాననే ఆశలేదు…అలా అని ఇటు చావను లేదు. ఇటువంటి పరిస్థితులలో వైసీపీ పార్టీని తిరిగి ప్రజలలోకి తీసుకు వెళ్ళడానికి ఆ పార్టీకి ఇప్పుడు ఒక బలమైన నాయకుడి అవసరం ఏర్పడింది. దీనితో మంగళగిరి పార్టీ బాధ్యతలు మోసే భుజాల కోసం వైస్ జగన్ ఆశగా ఎదురు చూస్తున్నారు.
అయితే మంగళగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఇప్పుడు పరోక్షంగా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్నట్టు రాజకీయాలకు, వైసీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక 2024 లో వైసీపీ తరుపున బరిలో నిలిచిన మురుగు లావణ్య కానీ, నారా లోకేష్ ని ఓడించాలని ఆశ పడ్డ గంజి చిరంజీవి కానీ ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరికీ తెలియని దుస్థితి.
ఇటువంటి పరిస్థితులలో పార్టీ బాధ్యతలు భుజాన వేసుకోవడానికి స్థానిక పార్టీ క్యాడర్ ను కలుపుకుని ముందుకు వెళ్ళడానికి దొంతి రెడ్డి వేమా రెడ్డి ముందుకొచ్చినట్లు సమాచారం. అయితే గతం నుంచి కూడా ఆర్కే vs వేమా రెడ్డి అన్నట్టుగా తాడేపల్లి రాజకీయ నడిచేది.
ఇప్పుడు ఆర్కే పార్టీకి దూరంగా జరగడంతో తనకు అవకాశం చిక్కింది అనే భావనలోకి వేమా రెడ్డి ఆ స్థానాన్ని తానూ భర్తీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే మునిగి పోయే పడవను ఎవరు నడిపినా ఒక్కటే అనే భావనలో ఉంది వైసీపీ క్యాడర్. తాడేపల్లి, పెనుమాక, నూతక్కి, వల్లభాపురం వంటి ప్రాంతాలలో వైస్ జగన్ కు సంబంధించిన సామాజికవర్గానికి చెందిన ఓటర్లదే హావ.
అయినప్పటికీ ఈ ప్రాంతంలో వైసీపీ ఓటమిని ఒప్పుకోకతప్పలేదు. దీనికంతటికి వైస్ జగన్ పాలనారాహిత్యం ఒక కారణం అయితే మరో కారణం వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్కే గా ముర్కత్వం మరో కారణంగా చెప్పవచ్చు. గత వైసీపీ హయాంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గా మంగళగిరి నియోజకవర్గాన్ని దక్కించుకున్న ఆళ్ళ తన సొంత పార్టీ నేతలను సైతం టార్గెట్ చేస్తూ పైశాచిక ఆనందం పొందారు.
అందులో ఈ దొంతి రెడ్డి వేమా రెడ్డి కూడా ఆర్కే బాధితుల లిస్ట్ లో ఒకరే కావడం ఇక్కడ విశేషం. అయితే ఆ రెడ్డి టైం లో ఈ రెడ్డి గారు సైలెంట్ అయితే ఇప్పుడు ఈ రెడ్డి గారి సమయంలో ఆ రెడ్డి గారు కనుమరుగయ్యారు. అయితే మంగళగిరిలో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఈ రెడ్డి ఆ రెడ్డి కలిసి వచ్చినా వైసీపీకి ఒరిగేది కానీ టీడీపీ కి తరుగేది కానీ శూన్యమనే చెప్పాలి.
ఒక విష సర్పం ఎలా అయితే తన గుడ్లను తానేతినేస్తూ తన పిల్లలను తానే చంపుకుంటుందో అలాగే ఆర్కే కూడా తనను నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలను, ఆ ప్రాంతాన్ని తానే విధ్వంసం చేసుకుని నాశనం చేయడానికి పూనుకున్నారు. దీనితో ఆప్రాంత ప్రజలలో వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.
మంగళగిరిలో ఓడింది వైసీపీ నాయకుడు కాదు వైసీపీ పార్టీ అనేది జగన్ ఎప్పటికి గ్రహిస్తారో. ఈ ప్రాంతంలో వైసీపీ బలోపేతానికి వైస్ జగన్ ఎన్ని ఆత్మీయ సమావేశాలు, సభలు నిర్వహించిన పార్టీని గెలిపించడం అనేది కల్ల. ఇక మంగళగిరిలో జగన్ ఎంతమంది నాయకులను మార్చిన వైసీపీ పార్టీ భవితవ్యాన్ని మాత్రం మార్చలేరు అనేది సుస్పష్టం.
లోకేష్ భారీ విజయంతో, గత పాలకుల తప్పుడు నిర్ణయాలతో మంగళగిరి టీడీపీ కంచుకోటగా మారిందనేది జగమెరిగిన సత్యమే అనేది అందరికి తెలిసినా ఇంకా ఎదో ప్రయాస పాట్లు పడుతున్నారు స్థానిక వైసీపీ శ్రేణులు. మంగళగిరిలో వైసీపీ పార్టీ బలోపేతం అనేది వైస్ జగన్ వల్లే కాలేనిది, వేమా రెడ్డి అనే ఒక కింద స్థాయి నాయకుడి వల్ల అవుతుందా.?




