“డీజే” పనైపోయింది!

Duvvada jagannadham Completes Shooting‘గబ్బర్ సింగ్’ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న “దువ్వాడ జగన్నాధమ్” సినిమాకు ‘గుమ్మడికాయ’ కొట్టేసారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ… దర్శకుడు హరీష్ ఈ విషయాన్ని ఖరారు చేసారు. ఈ సినిమా షూటింగ్ మెమరబుల్ గా సాగిందని, తన కెరీర్ లో ఇది చాలా స్పెషల్… అందుకు గానూ హీరో అల్లు అర్జున్ కు, నిర్మాత దిల్ రాజుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

దీంతో ఈ నెల 23వ తేదీన విడుదలకు లైన్ క్లియర్ చేసుకుంది. మరో పక్కన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. విడుదలైన ఆడియోకు మెగా అభిమానుల నుండి బ్రహ్మాండమైన స్పందనలు రావడంతో చిత్ర యూనిట్ కూడా ఫుల్ ఖుషిగా ఉంది. దిల్ రాజు కెరీర్ లో 25వ చిత్రంగా ప్రతిష్టాత్మకతను సొంతం చేసుకున్న ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంతో ఉంది.

ADVERTISEMENT

బన్నీ కెరీర్ లోనే భారీ విడుదలకు దిల్ రాజు సన్నాహాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఏపీ, తెలంగాణాలతో పాటు విదేశాలలో కూడా “దువ్వాడ జగన్నాధమ్” హంగామా ఓ రేంజ్ లో ఉండే విధంగా దిల్ రాజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ‘బాహుబలి 2’ తర్వాత విడుదల కాబోతున్న పెద్ద సినిమాగా “డీజే” ఏ రేంజ్ లో కలెక్షన్స్ ను కొల్లగొడుతుందోనని ట్రేడ్ పండితులు కూడా ఎంతో ఆసక్తిగా చిత్ర విడుదల కోసం వేచి చూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories