హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న 25వ సినిమాగా ప్రతిష్టాత్మకతను సొంతం చేసుకున్న “దువ్వాడ జగన్నాధమ్”కు సంబంధించి రెండవ పాటను సోమవారం నాడు సాయంత్రం సరిగ్గా 6 గంటలకు విడుదల చేసారు. ‘గుడిలో బడిలో మదిలో ఒడిలో’ అంటూ సాగిన ఈ పాటకు నెటిజన్లు నీరాజనాలు పలికారు. సరిగ్గా 24 గంటలు ముగిసే సమయానికి ఈ పాట 24 లక్షల క్లిక్స్ ను అందుకోవడం విశేషం. తొలి పాట ‘శరణం భజే’తో పోలిస్తే… రెండవ పాటకు డబుల్ హిట్స్ వచ్చాయి.
సాహితి అందించిన సాహిత్యం వినసొంపుగా ఉండగా, గణేష్ ఆచార్య కోరియోగ్రఫీ పాటకే అందాన్ని తీసుకువచ్చింది. ఇక మెలోడీ గీతాలను, ఫాస్ట్ బీట్ తో అందించే దేవిశ్రీప్రసాద్ సంగీతం శ్రోతలను మళ్ళీ మళ్ళీ చూసేలా చేసింది. దీంతో ఏకంగా 2.4 మిలియన్ క్లిక్స్ ను సొంతం చేసుకుంది ఈ పాట. మునుపటి పాట ‘శరణం భజే’తో పోలిస్తే లైక్స్ ను పెంచుకోగా, డిస్ లైక్స్ ను తగ్గించుకుంది. అయితే ఇదంతా కూడా ఒక నిముషం పాటకే! ఇది సూపర్ హిట్ కావడంతో ఫుల్ లెంగ్త్ సాంగ్ కావాలంటున్నారు సంగీత అభిమానులు.



