fire-engines-in-vijayawada-to-pull-over-mud-stagnated-mud-from-flood-areas

విజయవాడ వరదలలో ఎక్కువగా ప్రభావితం అయిన ప్రాంతం సింగ్‌ నగర్‌. బుడమేరు పొంగి ప్రవహించడంతో ఆ పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. మూడు రోజుల తర్వాత ఇప్పుడిప్పుడే నీళ్ళు వెనక్కు మళ్ళుతుండటంతో సహాయ చర్యలు జోరందుకుంటున్నాయి.

Also Read – పాపం శ్యామల… ఎలా నెగ్గుకొస్తారో?

ఏ సమస్యకైనా వినూత్నంగా పరిష్కారం ఆలోచించే సిఎం చంద్రబాబు నాయుడు సింగ్‌ నగర్‌ సమస్యకి ఓ కొత్త పరిష్కారం కనుగొన్నారు. మంటలు ఆర్పేందుకు ఉపయోగించే అగ్నిమాపక వాహనాలతో నీళ్ళు స్ప్రే చేయించి ఆ ప్రాంతంలో రోడ్లపై పేరుకుపోయిన బురదని తొలగించాలని నిర్ణయించారు.

బురద మేటలు వేసి ఎక్కువగా ఉన్నచోట్ల జేసీబీలతో, పలుచగా ఉన్న చోట్ల అగ్నిమాపక వాహనాలతో శుభ్రం చేయించాలని నిర్ణయించారు. నిన్న చెప్పిన్నట్లుగానే ఈరోజు మధ్యాహ్నంకల్లా ఆ ప్రాంతానికి సుమారు వందకు పైగా అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి.

Also Read – బిఆర్ఎస్ పార్టీని చంద్రబాబు నాయుడే బ్రతికించాలా?

రోడ్డుపై ఒకే వరుసలో నిలిచిన ఆ ఎర్రటి వాహనాలను చూస్తే పెద్ద రైలు కదులుతున్నట్లే ఉంది. ప్రభుత్వం ఇంత త్వరగా ఏర్పాట్లు చేస్తుందని ఊహించని స్థానికులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వరద ఉదృతి తగ్గగానే నగరంలో ప్రతీ కాలనీకి విద్యుత్, వైద్య సిబ్బందిని పంపిస్తానని సిఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దీని కోసం ఇరుగు పొరుగు జిల్లాల నుంచి విద్యుత్, వైద్య సిబ్బందిని రప్పిస్తున్నారు.

Also Read – అధికారంలో ఉన్నప్పుడే గడప గడపకి వెళ్ళలేదు!

సిఎం చంద్రబాబు నాయుడు అంతటితో తన పని అయిపోయిందని అనుకోలేదు. వరద నీటిలో మునిగి వేల సంఖ్యలో వాహనాలు పాడయ్యాయి. కొన్ని కొట్టుకుపోయాయి.

వాటి కోసం ఇన్స్యూరెన్స్ కంపెనీలు, బ్యాంకులతో మాట్లాడుతానని చెప్పారు. ఇన్స్యూరెన్స్ సౌకర్యం ఉన్నవారికి ఆ సొమ్ము, బ్యాంక్ లోన్లు తీసుకొన్నవారికి వాటి వాయిదాల చెల్లింపులలో వెసులుబాటు కల్పించాలని కోరుతామన్నారు.

ఈరోజు ఉదయం నుంచే బుడమేరు గండ్లను యుద్ధప్రాతిపదికన పూడ్చివేసేందుకు అధికారులు, యంత్రాలను పంపించారు. ఆ బాధ్యత మంత్రి నారా లోకేష్‌కి అప్పగించడంతో ఆయన అక్కడకి చేరుకొని పనులను పర్యవేక్షిస్తున్నారు.

మరో పక్క చుట్టుపక్కల ప్రాంతాలలో వరద ధాటికి కొట్టుకుపోయిన రోడ్లు, కల్వర్టులు, వంతెనల జాబితాని అధికారులు సిద్దం చేస్తున్నారు. వాటన్నిటినీ కూడా యుద్ధ ప్రతిపదికన పునర్నిర్మించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయిస్తున్నారు.

బహుశః మరో రెండు రోజులలో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మళ్ళీ సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. అంతవరకు తాను విశ్రాంతి తీసుకోనని, అధికారులు, సిబ్బందిని తీసుకోనీయనని సిఎం చంద్రబాబు నాయుడు ఖరఖండిగా చెప్పేశారు.




చివరిగా ఒక మాట చెప్పుకోక తప్పదు. ఈ రోజుల్లో ఆహారం, నీళ్ళు, వాతావరణంలో ఏ చిన్న తేడా వచ్చినా అనారోగ్యానికి గురవుతుంటాము. అలాంటిది 74 ఏళ్ళ వయసులో సిఎం చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు లేకుండా, వరద నీటిలో తిరుగుతూ అంత ఆరోగ్యంగా, అంత చురుకుగా ఎలా ఉండగలుగుతున్నారు?అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. బహుశః జగన్‌కి కూడా ఈ సందేహం కలిగే ఉంటుందేమో?