Ambati Rambabu

రాజకీయాలు చేయడానికి కూడా ఒక సమయం, సందర్భం అంటూ చూసుకోకుండా ప్రభుత్వం పై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తూ ప్రజలలో నవ్వులపాలవుతున్నారు వైసీపీ నేతలు. ఇందుకు ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మొదలుకుని నాయకుల వరకు అందరూ తమలో తాము పోటీ పడుతూ ఉంటారు.

అయితే తాజాగా మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని “COVID – 19” ని జగనన్న ప్రభుత్వం ఎలా ఎదుర్కొంది.? బుడమేరు వరదలను చంద్రన్న ప్రభుత్వం ఎలా ఎదుర్కొంది.? అంటూ తన సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

Also Read – వాఘా మూసేసి సరిహద్దులు తెరుస్తామంటున్న పాక్ పాలకులు!

అయితే మాజీ మంత్రి గారు పెట్టిన ఈ పోస్ట్ చూస్తుంటే ఆయనకు ‘వైరస్’ కు ‘వరద’ కు తేడా పెద్దగా తెలియదేమో అన్న సందేహం కలుగుతుంది. అంతేలే వీధి డాన్స్ లు చేసుకుంటూ, ఓ గంట సినిమా రివ్యూ లు చెప్పుకునే వారికీ ఇంతకన్నా ఎక్కువ అవగాహన ఉంటుంది అనుకోవడం వెర్రితనమే అవుతుంది అంటూ సోషల్ మీడియాలో మాజీ మంత్రిగా పని తనం మీద కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

వైరస్ వస్తే ఇంట్లో నుంచి బయటకు రాకుండా జాగ్రత్త పడితే కొంత వరకు ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు. అలాగే వైరస్ నియంత్రణకు వాక్సిన్లు అందుబాటులో ఉంటాయి. వాటితో కొంత మేర వైరస్ ను నియంత్రించవచ్చు. కానీ వరదలు వస్తే ఇంటి నుండి కట్టు బట్టలతో బయటకు రావాల్సి ఉంటుంది. అంతే కాదు తిరిగి వారు వారి ఇంటికి చేరుకునే వరకు ఆ కుటుంబాలకు అవసరమైన కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది.

Also Read – కేసులు, విచారణలు ఓకే.. కానీ కేసీఆర్‌, జగన్‌లని టచ్ చేయగలరా?

ఇప్పుడు చంద్రన్న ప్రభుత్వం చేస్తుంది అదే అన్న విషయం వైసీపీ నేతలకు అర్ధమయ్యే లోపు బుడమేరు వరదలు కాదు బుడమేరు ప్రక్షాళన కూడా పూర్తవుతుందేమో. ‘వరద కు వైరస్’ కు తేడా తెలియని వారు, ‘ప్రకృతి విపత్తుకి, మాన్ మెయిడ్ ఫ్లడ్స్’ కు తేడా తెలియని వారు రాష్ట్రానికి మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పని చేసేసారు.

అంతేకాదు covid అనేది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే వచ్చిన విపత్తు కాదు. ఈ వైరస్ వల్ల యావత్ ప్రపంచం అతలాకుతలమయ్యింది. అయినా వైసీపీ ప్రభుత్వంలో COVID -19 నియంత్రణకు అప్పటి ముఖ్యమంత్రి వైస్ జగన్ ఏపీ ప్రజలకు రెండు చిట్కాలు చెప్పి చేతుల దులుపుకున్న వైనం అంబటి గారు మరిచిపోయినట్టు ఉన్నారు.

Also Read – భారత్‌లో పాకిస్తానీలు.. ఓటు బ్యాంక్ రాజకీయాలు!

ఒక బ్లీచింగ్ పౌడర్, ఒక పారాసిటమాల్ టాబ్లెట్ తో COVID ను నియంత్రించవచ్చు, దీని కోసం ఎందుకు ఇంత హైరానా అంటూ రెండు ముక్కల్లో సమాధానం చెప్పి తాడేపల్లి ప్యాలస్ లో సేదతీరారు జగన్. బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ తో కోవిడ్ ను ఎదుర్కున్న జగన్ కు జల ప్రళయానికి ఎదురీదుతున్న బాబు తో పోలికా.?

మండే ఎండను గొడుగుతో ఆపొచ్చు, కాలే నిప్పు ను నీటితో ఆపగలం కానీ నీటిని అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం.? ఒకవేళ వైసీపీ లెక్క ప్రకారం వరద నీటిని బోట్లతో ఆపొచ్చేమో…బహుశా ఈ ఆలోచన ఇంకా ఎవరికీ తట్టి ఉండకపోవచ్చు. కోవిడ్ సమయంలో ప్రజలు ఏమైపోయినా పరవాలేదు, నాకు నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అన్నట్లుగా రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించి తన పంతం నెగ్గించుకున్నంత గొప్పగా జగన్ కోవిడ్ ను ఎదుర్కొన్నారు.

కానీ ఇక్కడ, నాకేమైనా పరవాలేదు ప్రజలు క్షేమంగా ఉంటే చాలు, అనేలా తన వయసుని కూడా లెక్కచేయకుండా వరద నీటిలో దిగి నేను ఇక్కడే ఉన్నాను, నన్ను నమ్మండి, ఇక్కడ సాధారణ పరిస్థితులు వచ్చిన తరువాతే నేను ఇక్కడి నుండి వెళతాను అంటు బాధితులకు భరోసా ఇచ్చారు బాబు.

జగన్ ప్రభుత్వంలో వచ్చిన కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రజలకు పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ సరిపోతుంది అని చెప్పిన వైసీపీ నేతలు వారి వైద్యం కోసం మాత్రం హుటాహుటిన హైద్రాబాద్ చేరుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో వచ్చిన వరద విపత్తుని ఎదుర్కోవడానికి అన్ని జిల్లాల ఎమ్మెల్యే లను, మంత్రులను, అధికారులను బాధిత ప్రాంతాలకు పిలిపించి స్వయంగా తానే క్షేత్ర స్థాయిలో సమీక్షలు నిర్వహించి పరిస్థితులను చక్క దిద్దుతున్నారు బాబు.

కోవిడ్ సమయంలో వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి ‘విడుదల రజని’ ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. కానీ బుడమేరు వరదల సమయంలో కూటమి ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రి ‘నిమ్మల రామానాయుడు’ ఎక్కడున్నారో రాష్ట్రం కాదు దేశం మొత్తం చూసింది.




జగనన్న ప్రభుత్వం ప్రజలు పట్ల ఎంత బాధ్యతగా పనిచేసి “COVID -19” అనే ఒక మహమ్మారిని ఎదుర్కుందో…అలాగే చంద్రన్న ప్రభుత్వం “బుడమేరు వరద” వంటి ఒక ప్రకృతి విపత్తుని ఎలా ఎదుర్కుంటుందో తెలుసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలనుకుంటా అంబటి గారు..! వరద..వైరస్ బోత్ ఆర్ నాట్ సేమ్.