
భారీ వర్షాలకు ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు వంటి నగరాలు జలమయం అయినప్పుడు, ఇంకా నిర్మాణ పనులు పునః ప్రారంభం కానీ అమరావతి రాజధాని ప్రాంతం జలమయం కాదా?అంటే కాకూడదనే వాదిస్తున్నాయి వైసీపి సోషల్ మీడియా గ్యాంగులు.
భారీ వర్షాల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, పంటలు నీట మునిగి రైతులు నష్టపోతున్నారనే బాధ వారిలో ఏ కోశాన్నా కనబడదు. అమరావతి నీట మునిగింపోయిందనే శాడిస్ట్ సంతోషమే కనిపిస్తుంటుంది. శాడిజం ఓ వ్యక్తిలో ఉండటం ఆశ్చర్యం కలిగించదు. కానీ ఆ పార్టీలో అందరికీ, ఆ పార్టీని అభిమానించే అందరికీ ఈ శాడిజం వ్యాపించడమే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
Also Read – ఇక్కడ బిఆర్ఎస్.. అక్కడ టీడీపీ: కల్వకుంట్ల కవిత
ఎందుకంటే, అమరావతి మునిగిపోయిందని చంకలు గుద్దుకుంటున్నవారు కూడా రాష్ట్ర ప్రజలే. కానీ వారికి రాష్ట్రం పట్ల, సాటి ప్రజల పట్ల ఎటువంటి అభిమానం, సానుభూతి లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
రాష్ట్ర ప్రజలందరూ గర్వించాల్సిన అమరావతిని జగన్ పాడుబెట్టి నాశనం చేస్తున్నప్పుడు ఏ ఒక్కరూ ప్రశ్నించలేదు… తప్పు పట్టలేదు. దాని వలన రాష్ట్రానికి వేలు లక్షల కోట్లు నష్టం వాటిల్లుతోందని తెలిసినా ఎవరూ తప్పు పట్టలేదు.
Also Read – దానం: గోడ మీద పిల్లి మాదిరా.?
అమరావతిని కాదని మూడు రాజధానులు, విశాఖ రాజధాని అని జగన్ 5 ఏళ్ళు కాలక్షేపం చేసేసినా వైసీపిని అభిమానించేవారికి తప్పుగా అనిపించలేదు. పచ్చటి ఋషికొండని ధ్వంసం చేసి దానిపై రూ.500 కోట్లతో ప్యాలస్ నిర్మించుకున్నా ఎవరికీ తప్పుగా అనిపించలేదు.
రాజధాని లేని రాష్ట్రమని అందరూ అవహేళన చేస్తున్నా సిగ్గనిపించలేదు. కానీ కనీసం డ్రైనేజి కాలువలు కూడా నిర్మించని అమరావతిలో నీళ్ళు చేరితే మన రాజధాని మునిగిపోయిందని సోషల్ మీడియాలో వైసీపి మద్దతుదారులు చంకలు గుద్దుకోవడం శాడిజం కాక మారేమిటి?
Also Read – భారత్ పాలిట కరోనాలా పాక్.. టీకాలు తప్పవు
అదే…గత 5 ఏళ్ళలో జగన్ ప్రభుత్వం అమరావతిలో నిర్మాణ పనులు కొనసాగిస్తూ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి ఉంటే అక్కడ ఒక్క చుక్క నీళ్ళు నిలబడి ఉండేవా?జగన్ నిర్లక్ష్యం కారణంగా అమరావతిలో పలు భారీ భవనాల పునాదులు గత 5 ఏళ్ళుగా నీళ్ళలో మునిగి ఉన్నాయి. వాటి దగ్గరకు చేరుకునేందుకు నిపుణుల బృందం బోట్లు వేసుకొని వెళ్ళి పరిశీలిస్తున్నప్పుడు వైసీపికి వంతపాడుతున్న ఎవరికీ సిగ్గనిపించలేదా?
జగన్‌కి చాతకాని పని అమరావతిని సిఎం చంద్రబాబు నాయుడు ఎలాగూ నిర్మించి చూపుతారు. కనుక ఓ 5 ఏళ్ళు ఓపిక పడితే చాలు. అప్పుడు భారీ వర్షాలు కురిసినప్పుడు రాజధాని అమరావతిలో ఉండటం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడవచ్చు. అప్పుడు జగన్‌తో సహా వైసీపి నేతలందరూ అమరావతిలోనే ప్యాలస్‌లు కట్టుకున్నా ఆశ్చర్యం లేదు.
floods on capital amaravati region