ఆనాడు వైసీపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి “నేను బటన్ నొక్కుతుంటాను… మీరందరూ గడప గడపకి వెళ్ళి డబ్బా కొట్టండి…” అని ఎంత మొత్తుకున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజల మద్యకు వెళ్ళడానికి ఇష్టపడేవారు కారు. వారిని ప్రజల వద్దకు పంపించడానికి జగన్ టికెట్స్ ఇవ్వనని బెదిరించాల్సి వచ్చింది. అయినా కూడా కొంతమంది మొక్కుబడిగా వెళ్ళి వచ్చేసేవారు.
Also Read – టాలీవుడ్ హీరోలూ… మీకూ సిన్మా చూపిస్తాం రెడీయా?
ఆ తర్వాత “నువ్వే మా నమ్మకం… భవిష్యత్” అంటూ జగన్ బొమ్మతో కోట్లు ఖర్చు చేసి స్టిక్కర్స్ ముద్రించి ప్రతీ ఇంటికీ అంటించి రమ్మని జగన్ ఒత్తిడి చేస్తే, పనిభారం, టెన్షన్ రెండూ లేని రోజా, అంబటి రాంబాబువంటి వారు భుజానికి ఆ సంచీలు తగిలించుకొని ఫోటోలు దిగారు. కానీ ఆ ప్లాన్ కూడా వర్కవుట్ కాలేదు.
అయిష్టంగానైనా వైసీపి నేతలు ఇవన్నీ చేసినా, చివరికి జగన్ చాలా మందికి టికెట్స్ ఇవ్వకుండా హ్యాండిచ్చి, నియోజకవర్గాలు మార్చేసి ముప్పతిప్పలు పెట్టారు. ఆ కారణంగా 90 శాతం మంది ఓడిపోతే, మరికొంత మంది పార్టీ వదిలి పారిపోయారు.
Also Read – సనాతన మార్గంలో మరిన్ని త్యాగాలు… పవన్ సిద్దమేనా?
కానీ పాస్‌పోర్ట్ చేతికి రాకపోవడంతో లండన్ వెళ్ళలేక ఇప్పుడిప్పుడే ప్రజల మద్యకు వస్తున్న జగన్, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను తాడేపల్లి ప్యాలస్‌కి పిలిపించుకొని, ప్రజల మద్యకు వెళ్ళాలని, కేసులకు భయపడకుండా నిరంతరం ప్రభుత్వంతో పోరాడాలని ఒత్తిడి చేస్తున్నారు.
వైసీపి అధికారంలో ఉన్నప్పుడే ప్రజల మద్యకు వెళ్ళేందుకు ఇష్టపడని నేతలు, ఎన్నికలలో జేబులు, బ్యాంకులు అన్నీ ఖాళీ చేసుకుని ఓడిపోయిన తర్వాత వెళ్ళమంటే వెళ్తారా?
Also Read – ఆ ఒక్కడి కోసమే ఏదైనా అవుతా..!
అయినా తమ అధినేత తాడేపల్లి-బెంగళూరు ప్యాలస్‌లలో సేద తీరుతూ లండన్ ఎగిరిపోతుంటే, వైసీపి నేతలు ప్రజల మద్యకు వెళ్ళమంటే వెళ్తారా?
ఇదివరకు టికెట్స్ కోసం ఆశతో వెళ్ళక తప్పేది కాదు… వెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఏ ఆశతో వెళ్తారు?
ఒకవేళ మళ్ళీ ఎన్నికల వరకు వైసీపి బ్రతికి బట్ట కడితే, అప్పుడు జగన్ టికెట్స్ ఇస్తానంటే, వాటితో గెలిచే అవకాశం ఉందనిపిస్తే, అప్పుడూ ఎన్నికలలో డబ్బులు వెదజల్లక తప్పదు. ఆ మాత్రం దానికి ఇప్పటి నుంచే ఎవరు తిరుగుతారు? తిరిగినా ఖర్చులకి జగన్ ఒక్క రూపాయి ఇవ్వరు కదా? ఇదేమన్నా టిడిపియా… చొక్కాలు చించేసుకోవడానికి వారేమైనా టిడిపి నేతలు, కార్యకర్తలా?