Gaddar Awards: Key Move by Revanth Reddy Govt

రాష్ట్ర విభజనతో ప్రభుత్వాల నుండి సినీ పరిశ్రమ అందుకునే నంది అవార్డులు రెండు తెలుగు రాష్ట్రాలలో అటకెక్కాయి. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు కొలువుతీరడంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సినీ పరిశ్రమకు, కళాకారులకు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం తరుపున అవార్డుల ప్రధానోత్సవానికి ముందుకొచ్చింది.

Also Read – ప్రధాని, సిఎం స్థాయి ఊరికే లభిస్తుందా బ్రదర్?

అందుకు ముందుగా తెలంగాణ ప్రభుత్వమైనా కాంగ్రెస్ టాలీవుడ్ కు తెలంగాణ ప్రభుత్వం తరుపున గద్దర్ అవార్డుల ప్రదానం ఉంటుందంటూ ప్రకటించింది, ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం కూడా గతంలో ఉన్న నంది అవార్డులను తిరిగి పునరుద్ధరిస్తామంటూ ప్రకటించింది.

దీనితో తెలుగు సినీ పరిశ్రమకు డబుల్ ధమాకా అందినట్టయ్యింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి నేడు హైద్రాబాద్ హైటెక్ సిటీ ముస్తాబయ్యింది.

Also Read – రేవంత్ తన మార్క్ చూపించబోతున్నారా.?

అయితే తెలంగాణ ప్రభుత్వం నుండి రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా జరుగుతున్న సినీ వేడుకలు కావడంతో అటు సినీ పరిశ్రమ తో పాటుగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ అవార్డుల కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకమగా తీసుకుంది.

అయితే పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన, ఆ తరువాత ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తెలంగాణలో భారీ ఎత్తున సినీ ఈవెంట్లు చేయడానికి సినీ పరిశ్రమ కాస్త వెనకడుగు వేస్తున్న మాట వాస్తవం.

Also Read – కాంగ్రెస్‌లో రోబోల తయారీ.. బీజేపి సెటైర్ అదిరిపోయిందిగా!

నాటి నుంచి భారీ స్థాయిలో ఈవెంట్లకు ప్లాన్ కాకుండా ఒక పరిమితమైన క్రౌడ్ తో పనికానిచ్చేస్తున్నారు సినీ నిర్మాతలు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ప్రెస్టీజియస్ గా తీసుకుని నిర్వహిస్తున్న కార్యక్రమం కావడంతో అటు రేవంత్ సర్కార్ అధికారులకు ముందస్తు హెచ్చరికలు గట్టిగానే పంపినట్టు కనిపిస్తుంది.

ఈ సమయంలో సభ ప్రాంగణానికి వచ్చే అభిమానుల మధ్య ఎటువంటి తొక్కిసలాటకు తావులేకుండా, ఎటువంటి రద్దీ లు ఏర్పడకుండా చాల జాగ్రత్తగా సభ నిర్వహించడానికి రేవంత్ సర్కార్ అన్ని అంశాల మీద ద్రుష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. అందుకు తగ్గట్టే పోలీస్ సిబ్బంది తో పాటు అన్ని అత్యవసర వసతులను అందుబాటులో ఉంచింది. .

ఇటు రాజకీయ నాయకుల ప్రొటొకాల్స్ నుంచి సినీ సెలబ్రెటీల హడావుడి వరకు, అలాగే కార్యక్రమానికి హాజరయ్యే అతిధుల నుంచి సామాన్య ప్రేక్షకుడి వరకు అందరి భద్రతా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. కాబట్టి అటు అధికారులు, ఇటు ప్రభుత్వ యంత్రంగా, అలాగే సినీ సెలబ్రెటీలు అత్యంత అప్రమత్తతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలగాలి.




అలాగే పుష్ప వివాదం తరువాత అటు అల్లు అర్జున్ అభిమనులు ఇటు రేవంత్ ఫాలోవర్స్ మధ్య ఒక మినీ యుద్ధమే జరిగింది. ఆ ఘటన తరువాత పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ కథ నాయకుడిగా అదే ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా అవార్డు తీసుకోబోవడంతో ఆ దృశ్యాన్ని చూసేందుకు అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.