రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అంటూ హామీ ఇచ్చి మహిళా ఓటర్లను ఆకట్టుకుని అందలం ఎక్కిన వైసీపీ అధికారంలోకి వచ్చిందే తడువుగా మద్యం పాలసీ ప్రక్షళన అంటూ మొదలుపెట్టి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపేలా జీవో తీసుకు వచ్చింది.
అయితే ఈ జీవో అమలుతో అప్పటి వరకు ప్రవైట్ వ్యక్తుల చేతులో ఉండే వేలాది మద్యం షాపులు ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోయాయి. దీనితో వీటి మీద ఆధారపడి జీవించే ఎన్నో కుటుంబాలు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డాయి. తమ పాలసీలతో ప్రజలకు ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలు తమ జీవో లతో ఉన్న ఉపాధిని దూరం చేసి లక్షలాదిమంది పొట్టకొట్టారు.
కనీసం ప్రభుత్వం విక్రయించే మద్యంలో అయినా నాణ్యత పాటించారా అంటే అక్కడ కూడా వైసీపీ విధ్వంసమే కనిపించింది. దేశంలో ఎక్కడ లేని బ్రాండ్లతో ఏపీ మద్యం దుకాణాలు కొత్త బ్రాండ్ ను సృష్టించుకున్నాయి. బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్, పవర్ స్టార్, త్రీ క్యాపిటల్స్ అంటూ నాణ్యత లేని మద్యంతో మందు బాబుల ప్రాణాలు తీసింది.
ఈ బ్రాండ్స్ ను గమనించిన షర్మిల ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలన్నీ లిక్కర్ షాప్ లో అమలవుతున్నాయి అంటూ జగన్ ప్రభుత్వం పై మండిపడ్డారు. రేటు పెంచితే లిక్కర్ కంజంషన్ తగ్గుతుంది అనే సరికొత్త వాదన తెర మీదకు తెచ్చి టాక్స్ పేయర్స్ బలహీనత మీద సొమ్ము చేసుకున్నారు జగన్.
అయితే వైసీపీ ఓటమికి ఈ లిక్కర్ పాలసీ కూడా తమవంతు పాత్ర పోషించిందనే చెప్పాలి. 2024 ఎన్నికల ప్రచారంలో అందుబాటులో నాణ్యమైన మద్యం అందిస్తాం అంటూ హామీ ఇచ్చి లిక్కర్ కంజ్యూమర్స్ మనసు గెలుచుకుంది టీడీపీ కూటమి.
అయితే ఎన్నికలో ఇచ్చిన హామీ అమలు దిశగా ఈ అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ విడుదలకు రంగం సిద్దమయ్యింది. గత టీడీపీ హయాంలో 50 నుండి 60 మధ్యలో ఉండే కోటర్ బాటిల్ వైసీపీ హయాంలో 200 కు చేరింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని 80 నుంచి 90 లేదా 100 లోపు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
అలాగే ఇంటర్ నేష్నల్ బ్రాండ్స్ అన్ని కూడా అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. నాసిరకం మద్యానికి స్వస్తి పలికి నాణ్యమైన అందుబాటులో ఉండే మద్యాన్ని అందించడానికి కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసినట్లు సమాచారం. దీనితో మందుబాబుల జేబుకు భారీ చిల్లుపడకుండానే కావాల్సిన బ్రాండ్ ను పొందే అవకాశం దొరికింది.
దీనితో మందుబాబులు హ్యాపీ. ఇక ఈసారి లిక్కర్ పాలసీలో మద్యం దుకాణాలను తిరిగి ప్రయివేట్ వ్యక్తుల చేతులకు అప్పగించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారు 2 లక్షలు నాన్ రిఫండల్ రుసుముతో టెండర్లకు ఆహ్వానం పలకబోతున్నారు. దీనితో ఈ ఐదేళ్లు గా ఉపాధి కోల్పోయిన ఎన్నో కుటుంబాలకు తిరిగి ఉపాధి దక్కినట్లయింది.
ఒక్క పాలసీ కొన్ని వేల కుటుంబాలను ఉపాధికి దూరం చేసి, కొన్నిలక్షల కుటుంబాల ఆరోగ్యాలతో వ్యాపారం చేస్తే, అదే ఒక్క పాలసీ ఎన్నో కుటుంబాలకు తిరిగి ఉపాధిని, నాణ్యమైన మద్యాన్ని అందిస్తుంది. దీనితో అటు మందుబాబులు..ఇటు మద్యం వ్యాపారులు ఇద్దరు ప్రభుత్వ పాలసీ కోసం వెయిటింగ్ అంటూ ఎదురుచూస్తున్నారు.




