పవన్‌ని పిలిచేందుకు ఇది రాజకీయసభ కాదు: బిజెపి

gvl narasimha rao -BJPఈనెల 11వ తేదీ సాయంత్రం ప్రధాని నరేంద్రమోడీ విశాఖకు వచ్చి రాత్రి నగరంలోనే బస చేస్తారు. మర్నాడు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో బహిరంగసభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఇప్పటి వరకు ఈ బహిరంగసభ గురించి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, జిల్లా వైసీపీ నేతలే మాట్లాడుతున్నారు. హడావుడి పడుతున్నారు. కానీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు, ఇతర బిజెపి నేతలు మొక్కుబడిగా మాట్లాడారు. ఈరోజు బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహ రావు విశాఖలో ప్రధాని బహిరంగసభ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

“ప్రధాని నరేంద్రమోడీ విశాఖలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు తరలిరావడం, నగరంలో ఒకట్టిన్నర రోజులు బస చేయడం విశాఖ ప్రజల అదృష్టమే. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏం కావాలి?ఇది అధికారిక కార్యక్రమమే తప్ప రాజకీయసభ కాదు గనుక దీనికి మా మిత్రపక్ష నేత పవన్‌ కళ్యాణ్‌ని ఆహ్వానించాలా వద్దా అనే విషయం మా పార్టీ అధిష్టానం చూసుకొంటుంది,” అని అన్నారు.

ADVERTISEMENT

విశాఖలో ప్రధాని పర్యటించడం అభినందనీయమే.. ఆహ్వానించవలసిందే. అయితే ఈ బహిరంగసభకు బిజెపికి మిత్రపక్షంగా ఉన్న జనసేనను దూరంగా పెట్టి నిత్యం బిజెపి నేతలు విమర్శిస్తున్న వైసీపీ నేతలతో రాసుకుపూసుకు తిరగాలనుకోవడమే విడ్డూరంగా ఉంది. ఇది ప్రధాని అధికారిక కార్యక్రమం కనుక సిఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి హాజరుకావడం అవసరమే. కానీ బహిరంగసభకు మిత్రపక్షం నేత పవన్‌ కళ్యాణ్‌ను ఆహ్వానించకూడదనే నిబందన ఏమీ లేదు కదా?అసలు జనసేనతో బందం బలపరుచుకోవాలంటే ఇంతకంటే గొప్ప అవకాశం ఎప్పుడు లభిస్తుంది?

భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవిని ఆహ్వానించగా లేనిది మిత్రపక్షంగా ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ని విశాఖ సభకు ఆహ్వానించడానికి అభ్యంతరం ఏమిటి?అంటే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజుకి పవన్‌ కళ్యాణ్‌ నచ్చడం లేదు కనుక ఆయన సూచన మేరకే దూరం పెడుతున్నట్లున్నారు. దీని వలన బిజెపి-జనసేన మద్య దూరం మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. బిజెపి అధిష్టానం కూడా ఇదే కోరుకొంటోందేమో?

ADVERTISEMENT
Latest Stories