hardik-pandya-humiliation

2023 ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై జట్టు చేతిలో ఓడిన హార్దిక్ నేతృత్వం లో ని ‘గుజరాత్ టైటాన్స్’ జట్టు వచ్చి అప్పటికి రెండేళ్లే అయినా, రెండు సార్లు ఫైనల్స్ కు పట్టుకెళ్లారు కెప్టెన్ హార్దిక్ పాండ్య. ఇంత మంచిగా సాగుతున్న తన కెరీర్ కు, 2024 మినీ ఆక్షన్ ముందు ముంబై జట్టు యాజమాన్యం చేసిన ఆ పని వల్ల హార్దిక్ 2024 ఐపీఎల్ ఒక డిసాస్టర్ గా మిగిలిపోయింది.

Also Read – నారదుడుకి తక్కువేమీ కాదు.. మన వర్మ

ముంబై జట్టుకు అప్పటికి కెప్టెన్సీ చేస్తున్న రోహిత్ శర్మ, జట్టు కు 5 సార్లు కప్పును అందించారు.అలాగే అప్పటికే ఆ జట్టులో సూర్య, బుమ్రా వంటి అగ్ర భారత ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ముంబై యాజమాన్యం ఒప్పందం మీద హార్దిక్ ను జట్టులోకి మళ్ళీ తీసుకొచ్చి కెప్టెన్సీ పగ్గాలను అందజేశారు. ఇక అప్పటినుండి హార్దిక్ కు వచ్చిన నెగటివిటీ అంతా ఇంతా కాదు.

తన 2024 ఐపీఎల్ మొత్తం ఒక పీడకల మాదిరి ముగిసింది. సొంత అభిమానులే తనను గేలి చేసిన స్థితి నుండి భారత దేశం మొత్త గర్వించేలా టి-20 వరల్డ్కప్ గెలవటం లో తనవంతు పాత్ర ఖరాకండి గా పోషించారు పాండ్య. ఫైనల్ లో క్లాస్సేన్ వికెట్, సెమీస్ లో తన బ్యాట్టింగ్, జట్టులో తాను తెచ్చిన సంపూర్ణత, ఇలా అన్ని కోణాల్లోనూ హార్దిక్ మెరుగయ్యారు.

Also Read – అమరావతి రాజధాని… మద్యలో మన చంద్రుడు

సొంత దేశం లో సొంత అభిమానులే తనను తన ఆటతీరును హేళన చేసిన స్థాయి నుండి కప్పు గెలిచాక ఆ గెలిచిన కప్పును రోడ్ షో చేస్తూ ముంబై వీధుల్లో తిప్పి, వాంఖేడి స్టేడియం కు తీసుకురాగా, అక్కడ ప్రసంగించిన విరాట్,రోహిత్ వంటి దిగ్గజాలు “హార్దిక్ ఒక అసాధారణ శక్తీ” అని యావత్ భారత దేశం మొత్తం వినపడేలా చెప్పే స్థాయి కి ఎదిగారు హార్దిక్.

ఓటములు విజయానికి బాటను చూపిస్తాయి అనే పెద్దల సామెత 2024 లో హార్దిక్ ఆట తీరుకు నిదర్శనముగా నిలిచింది. గాయం నుండి తిరిగి వచ్చాక ఐపీఎల్ లో అట్టర్ ప్లాప్ గా నిలిచిన తన ఆటతీరు పై తాను మనసుపెట్టి, తన తప్పులు సరిదిద్దుకుని, తనని తాను టీ-20 వరల్డ్ కప్ జట్టులో భాగమయ్యేలా చేసుకున్నాడు.

Also Read – నాడు – నేడు ప్రజా నాయకుడేనా….

ఒకసారి టీం లో స్థానం సంపాదించడంతో తన పని పూర్తయింది అన్నట్లు కాకుండా, తనను విమర్శించిన వారంతా నేడు తన పుట్టినరోజు సందర్భంగా వాట్సాప్, ఇంస్టాగ్రామ్ వంటి సామజిక మాధ్యమాల్లో తనను సత్కరించేలా పోస్టులు, స్టేటస్లు పెట్టేలా తన ఆట తోనే బదులిచ్చారు హార్దిక్.




‘కొందరు తన పై వచ్చే విమర్శలకు నోటి తోనే సమాధానం చెపితే, హార్దిక్ వంటి వారు తన ఆట తోనే బదులిస్తారు’ అంటూ హార్దిక్ కు “హ్యాపీ బర్త్ డే పాండ్య” అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు క్రికెట్ అభిమానులు.