భక్త ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తి నామస్మరణ చేసేవాడు. అతని తండ్రి హిరణ్యకశిపుడు విష్ణుమూర్తిని ఎంతగానో ద్వేషిస్తూనే ఆయన కూడా నిత్యం విష్ణునామ స్మరణ చేస్తూనే ఉండేవాడు. కాకపోతే ఒకరు భక్తితో… మరొకరు ద్వేషంతో చేశారు. అంతే తేడా!
కానీ నరసింహ స్వామి ఇద్దరికీ ఒకేసారి దర్శనం ఇచ్చారు. ముందుగా తనను ఎంతగానో ద్వేషించిన హిరణ్య కశిపుడికే మోక్షం ప్రసాదించాడు.
బీఆర్ఎస్ నేతల పరిస్థితి కూడా సరిగ్గా ఇదే. అందుకే నిత్యం సిఎం చంద్రబాబు నాయుడుని ద్వేషిస్తూ ఆయన నామస్మరణ చేస్తుంటారు. అందుకే కేసీఆర్‌కి ఫామ్‌హౌసులో సుఖపడేయోగం చంద్రబాబు నాయుడు కలిగించారు.
కానీ వారికి ఆ సుఖం సరిపోవడం లేదు. బీఆర్ఎస్ పార్టీలో అలా సుఖపడాలనుకునేవారు ఇంకా చాలా మందే ఉన్నారు. వారిలో హరీష్ రావు కూడా ఒకరు.
ఆయన ఫేవరేట్ సబ్జెక్ట్ కృష్ణా గోదావరి నీళ్ళ దోపిడీ. ఆ పేరుతో చంద్రబాబు నాయుడు నామ స్మరణ చేస్తుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ఇంకా ఆయనని కరుణించలేదు. కనుక హరీష్ రావు రోజూ ద్వేషించే ఆ నోటితోనే నేడు సిఎం చంద్రబాబు నాయుడుని మెచ్చుకున్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామస్తులతో మాట్లాడుతూ, “పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే నెలకు రూ.4,000 పించన్ ఇస్తానని హామీ ఇచ్చారు. కాగానే ఇస్తున్నారు.
కానీ మన సిఎం రేవంత్ రెడ్డి కూడా రూ.4,000 పించన్ ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ రెండున్నరేళ్ళయినా ఇంత వరకు ఇవ్వడం లేదు. అంటే ప్రజలను మోసం చేస్తున్నట్లే కదా?
ఇలాంటి వ్యక్తి చెప్పే మాయమాటలు నమ్మి మళ్ళీ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మరోసారి మోసపోవద్దు,” అని హరీష్ రావు అన్నారు.
మున్సిపల్ ఎన్నికలలో రేవంత్ రెడ్డిని ఓడించడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇలా చంద్రబాబు నాయుడు భజన చేసుకోవాల్సి రావడం విచిత్రంగానే ఉంది కదా?
కేసీఆర్ కరోనా సమయంలో కూడా రైతుబంధు ఆపలేదు
ఎమ్మెల్యేలు, ఉద్యోగుల జీతాలు ఆపి మరీ రైతులకు డబ్బులు ఇచ్చిండు
రేవంత్ రెడ్డి వచ్చినంక, ఐదు పంటల్లో మూడు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టిండు
ఇప్పుడు ఎన్నికలు అయ్యాక ఇస్తా అని లంగ మాటలు మాట్లాడుతున్నాడు
ఎన్నికలు అవ్వగానే సగం మంది రైతులకు… pic.twitter.com/GQkBd9bF0u
— (@Nallabalu1) February 6, 2026






