ఐదేళ్ళ జగన్ పాలనలో ఎప్పుడు చూసినా నోటి దురద మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపి నేతలు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌ల గురించి నోటికి వచ్చిన్నట్లు వాగుతుండేవారు.
నోటి దురద బాగా ఎక్కువ ఉన్నవారిలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నంబర్:1. కొడాలి నాని శాసనసభలో చంద్రబాబు నాయుడుని అవమానిస్తుంటే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ వారించకపోగా ముసిముసి నవ్వులు నవ్వారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?అన్నట్లు వైసీపి ఎమ్మెల్యేలు బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేశారు.
ఆనాడు పదవీ, అధికారం, జగన్ అండ చూసుకొని పేట్రేగిపోయిన కొడాలి నాని గొంతు ఇప్పుడు ఎక్కడా వినిపించడంలేదు. ఆయనకు నారా లోకేష్ చేస్తానన్న ‘సత్కారం’ త్వరగా చేయాలని అందరూ ఎదురుచూస్తున్నారు.
మంత్రులు అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాధ్, సీదిరి అప్పలరాజు, ఎంపీలు విజయసాయి రెడ్డి, కేశినేని నాని, మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, వల్లభనేని వంశీ ఇంకా చాలా మందే ఉన్నారు.
పదవీ అధికారం శాశ్వితమన్నట్లు వీరందరూ ఆనాడు చాలా రెచ్చిపోయి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడారు. కానీ ఇప్పుడు ఎవరూ నోరు విప్పడమే లేదు. వీరందరూ హటాత్తుగా ఎక్కడకు మాయం అయిపోయారని ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు.
పోసాని కృష్ణ మురళి, అలీ ఇద్దరూ సినిమాలలో చక్కటి కామెడీ చేశారు. కానీ పోసాని వైసీపిలో చేరాక తాను రాజకీయ నాయకుడు వేషం వేశాననుకొని రెచ్చిపోయి చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటివారి గురించి కూడా నోటికి వచ్చిన్నట్లు వాగారు. కానీ అలీ ఏనాడూ నోరు జారలేదు. ఏనాడూ మీడియా ముందుకే రాలేదు.
రాంగోపాల్ వర్మ కూడా సోషల్ మీడియాలో చాలా రెచ్చిపోయేవారు. చంద్రబాబు నాయుడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ తదితరులందరూ విలన్లు అన్నట్లు సినిమాలు కూడా తీసి వదిలారు. ఇప్పుడు పోసాని, వర్మ ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు.
వీరందరూ బయటకు కనిపించేవారు కాగా ఈ 5 ఏళ్ళుగా టిడిపి, జనసేన నేతలను వేటాడి వేధించిన వైసీపి నేతల జాబితా చాలా పెద్దదే ఉంది. వారి అక్రమాలు, అరాచకాలకు తోడ్పడిన అధికారుల జాబితా కూడా చాలా పెద్దదే ఉంది. అందుకే టిడిపి నేతలు వారందరిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఇంతగా రగిలిపోతున్నారని అనుకోవచ్చు.
అసలు రాష్ట్రంలో ఇటువంటి అవాంఛనీయ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయని ఆలోచిస్తే జగన్ వల్లనే అని చెప్పక తప్పదు. రాష్ట్రాన్ని పాలించమని, అభివృద్ధి చేయమని ప్రజలు ఆయనకు అధికారం కట్టబెడితే ఆ పని చేయకుండా రాక్షస పాలన చేశారు. అందుకు ఆయనకు, వైసీపికి ప్రజలు ఇప్పటికే శిక్షించారు. ఇక టిడిపి, జనసేనల ప్రతీకారానికి బలవక తప్పదు.
అధికారంలో ఉన్నప్పుడు బుద్దిగా పరిపాలన చేసుకొని ఉంటే నేడు ఈ ఓటమి ఉండేది కాదు… వైసీపి నేతలకు ఇన్ని కష్టాలు ఎదురయ్యేవి కావు కదా?
వైసీపి నేతలు రాజకీయాలలో ఉన్నారు కనుక ఏదో విదంగా తప్పించుకొని బయటపడవచ్చేమో కానీ జగన్ అండ చూసుకొని రెచ్చిపోయిన పోసాని, వర్మల పరిస్థితి ఏమిటి?వారిని ఇప్పుడు జగన్ ఎలాగూ ఆదుకోరు. వారిద్దరికీ ఇప్పుడు సినీ పరిశ్రమలోకి తిరిగి వెళ్ళగలరా?వెళ్ళినా ఎవరైనా ఆదరిస్తారా?




