ప్రముఖ నటుడు, సినీ నిర్మాత, ‘జయభేరీ కన్‌స్ట్రక్షన్స్’ సంస్థ అధినేత మురళీ మోహన్‌కి హైడ్రా నోటీస్ ఇచ్చింది. ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాలలో వైరల్ అయ్యింది. హైదరాబాద్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులో రంగలాల్ కుంట చెరువు పరిధిలో నిర్మాణాలు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ నిబందనలను అతిక్రమించిన్నట్లు గుర్తించామని, కనుక 15 రోజులలోగా వాటిని స్వయంగా కూల్చేయాలని లేకుంటే మేమే కూల్చేస్తామని హైడ్రా జయభేరీ సంస్థకి నోటీస్ ఇచ్చింది.
ఆ ప్రాంతంలో జయభేరీ సంస్థ చాలా కాలం క్రితమే అనేక విలాసవంతమైన బహుళ అంతస్తుల సముదాయాలు నిర్మించింది. వాటిలో ఏ ఒక్కటి కూల్చినా ‘జయభేరీ కన్‌స్ట్రక్షన్స్’ దాని అధినేత మురళీ మోహన్ తీవ్రంగా నష్టపోతారు. అప్రదిష్టపాలవుతారు.
Also Read – అక్కడో వివాదం, ఇక్కడో వివాదం… అసలు కంటే కోసరే ఎక్కువ?
అయితే మురళీ మోహన్ ఏమాత్రం జంకలేదు. హైడ్రా ఎందుకు మేమే స్వయంగా కూల్చేస్తామని చెప్పారు. అయితే హైడ్రా నోటీస్ ఇచ్చింది ఆ బహుళ అంతస్తుల భవనాలకి కాదు… జయభేరీ సంస్థకు చెందిన రేకులతో నిర్మించిన ‘వర్క్ షాప్’కు. బఫర్ జోన్‌లో అది మూడు అడుగులు అతిక్రమణ ఉన్నట్లు గుర్తించి దానిని తొలగించాలన్నారు.
జయభేరీకి హైడ్రా నోటీసుల వార్త రెండు తెలుగు రాష్ట్రాలలో వైరల్ అవుతుండటంతో, మురళీమోహన్ వెంటనే స్పందిస్తూ, “జయభేరీ సంస్థ అంటే నిజాయితీ… నమ్మకం. సుమారు 33 ఎల్లకి పైగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాము.
Also Read – సిట్టూ…బిట్టూ వద్దట… ఎందుకు జగన్మావయ్యా?
కానీ మా సంస్థ ఏనాడూ చట్టాన్ని, నియమ నిబంధనలని ఉల్లంగించలేదు. మా వర్క్ షాప్ బఫర్ జోన్‌లో 3 అడుగులు అతిక్రమించిందని చెపుతూ కూల్చేస్తామని హైడ్రా నోటీస్ ఇచ్చిన మాట వాస్తవమే. కనుక వారికి అంత శ్రమ కల్పించము. మేమే స్వయంగా రేపు (సోమవారం) దానిని తొలగించేస్తాము,” అని చెప్పారు.
మురళీ మోహన్ టిడిపికి చెందినవారు కనుక జయభేరీకి హైడ్రా నోటీస్ ఇవ్వగానే కొందరు పైశాచికానందం ప్రదర్శిస్తూ ట్వీట్స్ వేశారు. అయితే వ్యాపారంలో మురళీ మోహన్ నీతి, నిజాయితీ, నిఖచ్చితనమే జయభేరీని హైడ్రా నుంచి కాపాడిందని చివరికి స్పష్టమైంది.