ఈ మాట అంటోంది ఇండియన్స్ కాదు… బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా. ఎడ్జ్ బాస్టన్ వేదికగా గురువారం నాడు జరగనున్న రెండవ సెమీ ఫైనల్ లో తలపడనున్న భారత జట్టును నిలువరించి, ఫైనల్లో అడుగు పెడతామని బంగ్లాదేశ్ కెప్టెన్ ధీమాగా చెప్తున్నారు. ఇప్పటికే ఓ వరల్డ్ కప్ లో టీమిండియాకు షాక్ ఇచ్చిన ఘనచరిత్ర తమకుందని, అదే విశ్వాసంతో టీమిండియాను ఎదుర్కొంటామని చెప్తున్నాడు.
ముఖ్యంగా విజయం సాధించాల్సిన ఒత్తిడి భారత జట్టుపైనే ఉంది కాబట్టి, ఎలాంటి ఒత్తిడి లేకుండా తాము ఆడి విజయం సాధిస్తామని, భారీ అంచనాలు టీమిండియాకు ప్రతికూలంగా మారతాయని మొర్తజా అభిప్రాయపడ్డారు. అయితే బంగ్లాను తక్కువగా అంచనా వేయడానికి లేదని క్రికెట్ పండితులు కూడా టీమిండియాను హెచ్చరిస్తున్నారు. తమదైన రోజున ఎలాంటి జట్టునైనా ఓడించగల సత్తా బంగ్లాదేశ్ సొంతం.
ఈ టోర్నీలో 8వ జట్టుగా బరిలోకి దిగిన బంగ్లా సెమీ ఫైనల్ కు చేరుకుందంటే చెప్పుకోదగ్గ విషయమే. అయితే దీనికి ‘వరుణుడు’ రూపంలో ‘కాలం’ కలిసి వచ్చిందనుకోండి! ఏది ఏమైనప్పటికీ మొర్తజా చెప్పినట్లు… బంగ్లాదేశ్ రెట్టించిన ఉత్సాహంలో ఉండగా, టీమిండియా ఒత్తిడిలోనే ఉందని చెప్పవచ్చు. గతంలో బంగ్లా వలన తగిలిన దెబ్బలు అలాంటివి మరి! బుధవారం నాడు తొలి సెమీ ఫైనల్ ఇంగ్లాండ్ – పాకిస్తాన్ జట్ల మధ్య జరగనుంది.



