రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధారిత రాష్ట్రంగా మారినందున, పారిశ్రామికాభివృద్ధి ఎంత అవసరమో, వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు సాగునీటి ప్రాజెక్టులు కూడా అంతే ముఖ్యం.
వైసీపీ హయంలో అంబటి రాంబాబుకి అత్యంత కీలకమైన సాగునీటి శాఖ మంత్రి పదవి, దాంతో అయన తన సామర్ధ్యం నిరూపించుకునేందుకు గొప్ప అవకాశం లభించింది. కానీ తలుపు తట్టి వచ్చిన ఆ అదృష్టాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారు.
ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ గురించి అయన చేసిన వ్యాఖ్యలు తనకు తాను ఇచ్చుకున్న ‘బ్యాడ్ కాండక్ట్ సర్టిఫికేట్’విగా మిగిలిపోయాయి. ఆయనకు అవగాహనకు మించిన శాఖని అప్పగించడం వల్లనే ఈవిధంగా జరిగిందని చెప్పక తప్పదు. దీనికి తోడు సుకన్య, అర్ధగంట, సత్తెనపల్లి డాన్సులు ఆయనకు భుజకీర్తుల్లా మిగిలిపోయాయి.
వైసీపీ హయంలో అంబటి రాంబాబు వంటి మంత్రి నిర్వహించిన శాఖని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నిమ్మల రామానాయుడు నిర్వహిస్తున్నారు.
ఆయనకు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏయే ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయో, వాటి ఆర్ధిక, సాంకేతిక వివరాలు, వాటి ఉపయోగాల గురించి పూర్తి అవగాహన ఉంది. ముఖ్యంగా ఈ రంగంపై మంచి పట్టు, ఆసక్తి ఇంకా చెప్పాలంటే వల్లమాలిన ప్రేమ ఉన్నాయి.
అందువల్లే ఆయన ఎటువంటి ప్రచారార్భాటం లేకుండా నిత్యం ఏదో ఓ ప్రాజెక్టు వద్ద పనుల పురోగతిని సమీక్షిస్తూ కనిపిస్తుంటారు. ఇంత నిబద్దత, సమర్ధత కలిగిన అయన ఈ శాఖని చేపట్టడం వైసీపీ పాలిట మరో శాపంగా మారిందని చెప్పక తప్పదు.
నీళ్ళ పేరుతో వైసీపీ నేతలు చేస్తున్న ఆందోళనలపై నిమ్మల స్పందన ఇందుకు ఓ చక్కటి ఉదాహరణ. అయన మీడియాతో మాట్లాడుతూ, “అసలు వైసీపీ నేతలకు రాష్ట్రంలో ఏయే ప్రాజెక్టులున్నాయి? వాటి పనుల పురోగతి గురించి కనీసం అవగాహన ఉందా?
జలాశయాలు ఉంటే సరిపోదు. వాటి నుంచి ఆయకట్టు వరకు నీళ్ళు చేరేందుకు కాలువలు వగైరా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ కూడా ఉండాలి. అవి లేకుండా జలాశయాలలో నీళ్ళు నింపి ఏం ప్రయోజనం?
అయినా ఏదైనా కొత్త జలాశయంలో ఒకేసారి పూర్తి స్థాయిలో నీళ్ళు నింపకూడదు. రెండు మూడు సంవత్సరాల వ్యవధిలో క్రమంగా నీటి మట్టం పెంచుకుంటూ వెళ్ళాలి. ఇంత చిన్న విషయం తెలియకుండా వైసీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. వచ్చే వేసవి నాటికి నల్లమల్లసాగర్ ద్వారా రాయలసీమ ప్రజలకు తాగునీరు అందించబోతున్నాము,” అని మంత్రి నిమ్మల చెప్పారు.
వైసీపీ హయంలో జగన్ చేసిన మరో నిర్వాకాన్ని అయన సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. నాడు జగన్ మీడియాతో మాట్లాడుతూ, “నేను వెలిగొండ సొరంగ మార్గంలో ఆ చివరి ఈ చివరి వరకు ప్రయాణించి, అన్ని పనులు పూర్తయ్యాయని నిర్ధారించుకున్నాను. ఆ తర్వాత ఈ ప్రాజక్టుని జాతికి అంకితం చేశాను,” అని చెప్పుకున్నారు.
కానీ మంత్రి నిమ్మల వెలిగొండ సొరంగ మార్గంలో అడ్డంగా ఉండి పోయిన టన్నల్ బోరింగ్ మెషిన్ వద్ద నిలబడి, “ఇక్కడ ఇది ఇలా అడ్డుగోడలా నిలబడి ఉండగా చుక్క నీరు అటు నుంచి ఇటు రాదు. దీనిని ఇలాగే వదిలేసి, ఈ ప్రాజెక్టుని జగన్ జాతికి అంకితం చేసేశారు.
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా దీనిని పూర్తిగా కట్ చేసి బయటకు తీయించి, లోపల మిగిలిన పనులు పూర్తి చేయించాము.
అలాగే జగన్ ప్రభుత్వం నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించకుండా వెళ్ళిపోతే, మా ప్రభుత్వం వారందరికీ సుమారు రూ.900 కోట్లు చెల్లించింది. ప్రాజెక్టు పనులు, నష్టపరిహారం చెల్లింపులు పూర్తిచేశాము. అందువల్లే ఈ నెల 31న సిఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వెలిగొండ (సొరంగ మార్గాలు) ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయబోతున్నారు,” అని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.
కనుక మాజీ మంత్రి అంబటి రాంబాబు, ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు ఇద్దరిలో ఎవరు బెస్ట్? ప్రజలే నిర్ణయించుకోవాలి.
ఈ నెల 31 న వెలిగొండ ప్రాజెక్ట్ నుండి నల్లమల సాగర్ రిజర్వాయర్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జలాలు విడుదల చేయనున్న సందర్బంగా సహచర మంత్రులు, గొట్టిపాటి రవి కుమార్ గారు, డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు, యర్రగొండు పాలెం… pic.twitter.com/PkL2Psukte
— Nimmala Ramanaidu (@RamanaiduTDP) August 29, 2026





