భారత్‌కు ధర్మ సంకటం!

Sheikh Hasina asylum crisis between India and Bangladesh

భారత్‌కు పెద్ద ధర్మ సంకటం ఎదురైంది. గత ఏడాది బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు జరిగినప్పుడు ప్రధాని షేక్ హసీనా త్రుటిలో తప్పించుకొని భారత్‌ చేరుకున్నారు. ఆమెకు భారత్‌ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోంది. ఆమెకు ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం మరణ శిక్ష విధించడంతో ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ని కోరింది. ఆమెను అప్పగిస్తే మరణ శిక్ష విధించడం ఖాయం. అంటే ఆమె ప్రాణాలు ఇప్పుడు భారత్‌ చేతిలో ఉన్నాయన్న మాట!

ఒకవేళ అప్పగించకుంటే భారత్‌ -బంగ్లాదేశ్ దౌత్య సంబంధాలు మరింత దెబ్బ తినడం ఖాయం. ఈ వ్యవహారంలో కూడా ట్రంప్‌ వేలుపెడితే ఇంకా ఇబ్బందికరంగా మారవచ్చు. కనుక ఆమెకు రాజకీయ ఆశ్రయం కల్పించినందుకు ఇప్పుడు భారత్‌కు పెద్ద ధర్మ సంకటం ఎదుర్కొంటోంది.

ADVERTISEMENT

అయితే ఆమె విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్పష్టతతోనే ఉండటం ఆమె అదృష్టం. ఆమెను తమకు అప్పగించాలనే బంగ్లాదేశ్ అబ్యర్ధనపై భారత్‌ చాలా ఆచితూచి స్పందించింది. భారత్‌-బాంగ్లా సంబంధాలు బలంగా ఉండాలని, బాంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం పునరుద్దరణకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి భారత్‌ సిద్ధంగా ఉందని చెపుతూనే ఆమెని తిరిగి అప్పగించలేమని సున్నితంగా తిరస్కరించింది. భారత్‌ జవాబు పట్ల బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితిలో చైనా, పాకిస్తాన్‌ వంటి దేశాలు దానిని వెనుక నుంచి భారత్‌కు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తాయని వేరే చెప్పక్కరలేదు.

ఆపరేషన్ సింధూర్‌కి ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్న పాకిస్తాన్‌, హసీనాని అప్పగించనందుకు బంగ్లాదేశ్ చేతులు కలిపితే వాటికి ఆయుధాలు అందించేందుకు చైనా, తుర్కియే సిద్ధంగా ఉంటాయని వేరే చెప్పక్కరలేదు. మంచికి పోతే చెడు ఎదరవడం అంటే ఇదేనేమో?

ADVERTISEMENT
Latest Stories