అదే హోరూ..అదే జోరూ..!

India vs Bangladesh T20

2024 టి-20 ప్రపంచకప్ ను అందుకున్నాక, భారత క్రికెట్ దిగ్గజాలు ‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ’ పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు. టీ-20 క్రికెట్ పుట్టినప్పటి నుండి జట్టులో భాగం అయిన వీరిద్దరూ ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించటంతో అందరూ ‘భారత్ జట్టు మళ్ళీ ఇలా నెంబర్-1 స్థానంలో ముందుకుకొనసాగగలుగుతుందా.? అనే సందేహాన్ని వ్యక్తపరిచారు.

అయితే, శర్మ-విరాట్ ల రిటైర్మెంట్ అనంతరం ‘సూర్య కుమార్’ కు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించింది భారత బోర్డు యాజమాన్యం. ఇక కోచ్ గా గంభీర్ రావడంతో కుర్ర క్రికెటర్లు అందరికి పండగ లాగా మంచి అవకాశాలు దక్కుతున్నాయి. నితీష్, హర్షిత్, మయాంక్, అభిషేక్, పరాగ్ వంటి యువకులందరికి వారి సామర్ధ్యాన్ని చూపించుకునేందుకు అవకాశాలు దక్కుతున్నాయి.

ADVERTISEMENT

నిన్న జరిగిన ఇండియా vs బంగ్లాదేశ్ రెండవ టీ-20 లో భారత్ పవర్ ప్లే లోనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయం లో నితీష్-రింకు ల జోడి భారత్ ను కష్టాల నుండి బయట పడేసింది. నితీష్ తన ఆటలో చూపిన టెంపర్మెంట్ అత్యద్భుతం అంటు కొనియాడుతున్నారు సీనియర్లు.

ఫాస్ట్ బౌలింగ్ ఆల్-రౌండర్ ల కొరత ఉన్న ఈ సమయంలో నితీష్ జట్టుకు ఎంతో ఉపయోగపడతారు. హార్దిక్ పాండ్య తరువాత మళ్ళీ ఆ స్థాయి కలిగిన పేస్-ఆల్ రౌండర్ ప్రస్తుత భారత్ జట్టులో మరొకరు లేరు. ఇపుడు ఆ లోటును నితీష్ భర్తీ చేస్తున్నారు. అతని అమోఘమైన ప్రదర్శన కు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మన తెలుగు కుర్రాడు “నితీష్” ను వరించింది.

అది అలా ఉండగా, ‘రింకు సింగ్’ చూపిస్తున్న నిలకడతనం బహుశా టీ-20 క్రికెట్ లో ఎవరూ చూపించి ఉండరు అనే స్థాయిలో రింకు మీద ప్రశంసలు వచ్చి పడుతున్నాయి.దీనితో రింకు,జట్టులో తన స్థానం ఖాయం చేసుకున్నట్లే. అలాగే బౌలర్ గా ఈ సిరీస్ లో నే డెబ్యూ చేసిన మయాంక్ యాదవ్ సైతం మంచి లైన్ అండ్ లెన్త్ తో బౌలింగ్ చేస్తూ మన్ననలు పొందుతున్నారు.

సూర్య, హార్దిక్ ల వంటి సీనియర్ ఆటగాళ్లు తమ జూనియర్ కుర్రాళ్లను అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వారు జూనియర్స్ లో నింపే ఆత్మస్థైర్యం వలనే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి అనడంలో సందేహమే లేదు. దీనితో, శర్మ-విరాట్ లు జట్టులో లేకున్నా, జోరు తగ్గనివ్వకుండా, కుర్రాలంతా “అదే హోరు..అదే జోరు..” ను కొనసాగిస్తున్నారు అని క్రికెట్ అభిమానులు ఖుషి అవుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories