ప్రస్తుతం జరుగుతున్న భారత్-బంగ్లా 3 టెస్టుల సిరీస్ లో మొదటి టెస్ట్ సెప్టెంబర్ 19 న ప్రారంభమయింది. తొలుత బాటింగ్ చేయవలసివచ్చిన భారత్ ఓపెనర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ రోహిత్, టాప్ ఆర్డర్ బ్యాటర్లు గిల్,విరాట్ సైతం ఆశించిన మేరకు సత్తా చాటలేదు. మళ్ళీ 632 రోజుల తరువాత టెస్ట్ ఫార్మటు కు ఎంట్రీ ఇచ్చారు రిషబ్ పంత్.
2023 సంవత్సరం మొత్తం అంతర్జాతీయ క్రికెట్ కు దూరమయిన పంత్, తిరిగి 632 రోజుల తరువాత వైట్ జెర్సీ లో దర్శనమిచ్చారు. జైస్వాల్-పంత్ యొక్క భాగస్వామ్యం జట్టు ను కోలుకోగలిగేలా చేసింది. ఆ పిమ్మట వచ్చిన “రవి” జత బంగ్లా జట్టు పాలిట అస్తమించని “రవి” వలె ఆ రోజంతా ముచ్చమటలు పట్టేలా చేసారు.
అశ్విన్ మళ్ళీ తన హోమ్ గ్రౌండ్ లో సెంచరీ చేసి చెన్నై అభిమానులకు గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ను చూపించారు. అంతర్జాతీయ టెస్ట్ ల లో 8 లేదా కింద స్థానములో బ్యాట్టింగ్ కు వచ్చి,ఎక్కువ సెంచరీలు చేసిన జాబితాలో ‘విట్టోరి’ తో సరిసమానంగా మొదటి స్థానం లో ఉన్నారు. 2021 లో ఇంగ్లాండ్ మీద ఇదే చెన్నై గ్రౌండ్ లో చివరి సెంచరీ నమోదు కాగా,మళ్ళీ 3 ఏళ్ళ తరువాత అదే గ్రౌండ్ లో ఆ ఫీట్ అందుకోవటం ఆశ్చర్యకరం.
రవీంద్ర జడేజా తన బాటింగ్ పై వస్తున్న ఆరోపణలన్నిటికి, తన బ్యాట్ తో నే బదులిచ్చారు. జట్టు క్లిష్ట సమయం లో ఉన్నపుడు క్రీజ్ లో కి వచ్చి, జట్టు కు ఎలా కావాలో అలాగే బ్యాట్టింగ్ చేసి, జట్టు ను ముందుకు నడిపించారు జడేజా. అశ్విన్ కు చక్కగా తోడ్పడ్డారు రవి జడేజా. ఈ కలయిక కేవలం బాటింగ్ ఏ కాక, బౌలింగ్ లో సైతం తమ సత్తా చూపించారు.
బంగ్లా మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకే అల్ అవుట్ అవ్వగా, బుమ్రా కు 4 , సిరాజ్,జడేజా,ఆకాష్ కు చెరొక 2 వికెట్లు దక్కాయి. భారత్ రెండవ ఇన్నింగ్స్ వచ్చేపాటికే భారీ ఆధిక్యం ఉండగా, దాన్ని మరింత బలపరిచారు గిల్-పంత్ భాగస్వామ్యం. ఇద్దరు సెంచరీలు అందుకోగా, డే-3 రెండవ సెషన్ కే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి, బంగ్లా కు 515 లక్ష్యాన్ని ముందుంచారు.
మూడవ రోజు ఆట ముగిసే సరికి, బంగ్లా 158 పరుగులకు 4 వికెట్లు కోల్పోగా,అందులో 3 వికెట్లు ‘అశ్విన్’ ఖాతా లో నే చేరాయి. బంగ్లా,ఇంకా గెలుపు కు 357 పరుగులు వెనుకంజ లో ఉండగా,భారత్ గెలుపుకు 6 వికెట్లు దూరం లో ఉన్నారు. చూడాలి మరి భారత్ డే-4 లో నే మ్యాచ్ ను ముగిస్తారా లేదా ఆట డే-5 కు కొనసాగుతుందా అని..?
ఈ మ్యాచ్ మన చేతిలో ఉండటానికి ముఖ్య కారణాలుగా మారిన ‘రవి’ జడేజా, ‘రవి’ అశ్విన్, ‘రిషబ్’ పంత్ ల ను జత చేసి “ఆర్.ఆర్.ఆర్” ఆదుకున్న మ్యాచ్ అంటూ ముగ్గురు క్రికెటర్ల అభిమానులు ఖుషి అవుతున్నారు. సంవత్సరం తర్వాత ఎంట్రీ ఇచ్చిన పంత్ ఈ రేంజ్ కంబ్యాక్ ఇస్తాడని ఊహించలేదెవరు. ఇన్ని ఏళ్ళ నుంచి టీం వెన్నుముకగా నిల్చున్న “రవి” జత మరల టీం కష్ట సమయాల్లో వెన్నుగా నిలిచి, వారి ఆట విశిష్ఠతు ను మరల చూపించారు.




