ఫైనల్… ఇండియా వర్సెస్ పాకిస్తాన్..!

India Vs Pakistan ICC Champions Trophy 2017 Finalsశ్రీలంక పైన ఎందుకు ఓడిపోయామన్న ఆవేదనో… ఖచ్చితంగా సఫారీలపై గెలవాలన్న తపనో గానీ… ఆదివారం నాడు జరిగిన కీలక మ్యాచ్ లో భారత్ ప్రదర్శించిన ఆట తీరు అమోఘం… అద్వితీయం..! నిజానికి తొలుత బౌలింగ్ ఎంచుకున్నప్పటికీ, భారత బౌలర్లను నిలువరించి తొలి వికెట్ కు ఏకంగా 76 పరుగులు జోడించడంతో… భారీ స్కోర్ దిశగా సఫారీలు పరుగులు పెట్టడం ఖాయంగా భావించారు. కానీ అప్పటికే సఫారీలపై ఒత్తిడి పెంచడంతో సక్సెస్ సాధించిన టీమిండియా బౌలర్లు చివరికి 191 పరుగులకే ఆలౌట్ చేసేసారు.

ADVERTISEMENT

బౌలింగ్ తో పాటు అద్భుతమైన ఫీల్డింగ్ ప్రతిభ కూడా కనపరచడంతో ఏకంగా మూడు రనౌట్లు నమోదయ్యాయి. ఇక స్వల్ప లక్ష్య చేధనలో తొలుత రోహిత్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ, శిఖర్ ధావన్ (78 పరుగులు) మరో అర్ధ సెంచరీ సాధించగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అజేయమైన 76 పరుగులు చేసి… తన చేజింగ్ పవర్ ఏమిటో నిరూపించుకున్నాడు. దీంతో 38 ఓవర్లలోనే టీమిండియా లక్ష్యాన్ని చేధించి సెమీస్ లో అడుగు పెట్టింది. ఇక ఫైనల్ కు చేరుకుందుకు బంగ్లాదేశ్ ను నెగ్గాల్సి ఉండగా, ఇది లాంచనప్రాయమే అనేది అభిమానుల భావన.

ఇక చివరి లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో శ్రీలంక తేల్చుకోనుంది. బౌలింగ్ లో పాకిస్తాన్, బ్యాటింగ్ లో శ్రీలంక జట్లు బలంగా ఉండగా, చేజింగ్ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో సెమీస్ ఇంగ్లాండ్ తలపడనుంది. ఒకవేళ పాకిస్తాన్ జట్టు వరుసగా రెండు మ్యాచ్ లు నెగ్గి… బంగ్లాపై ఇండియాగెలిస్తే… ఫైనల్లో మరోసారి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ను చవిచూడవచ్చు. నిజంగా అదే జరిగితే… క్రికెట్ ప్రేమికులకు అంతకు మించి ఏం కావాలి..!

ADVERTISEMENT
Latest Stories