జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్లు పూర్తిచేసుకుని, ప్లేఆఫ్స్ పోరు కు ఆసక్తి ని పెంచే విధముగా, ఇక నుండి జరిగే ప్రతి మ్యాచ్ యొక్క ఫలితం పై పాయింట్స్ టేబుల్ ఆధారపడుతుంది.
కాగా,ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్స్ టేబుల్ లో అగ్ర స్థానాన్ని ఎన్నో రోజులుగా ఒడిసిపట్టుకున్నారు. ఆ కింద కోల్కతా నైట్ రైడర్స్ రెండవ స్థానాన్ని భర్తీ చేసారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మూడు మరియు నాలుగవ స్థానానికి పరిమితమయ్యి ప్లేఆఫ్ పోరు కు దగ్గరలో ఉన్నారు.
అయినా, ఐదవ స్థానం లో ని లక్నో సైతం చెన్నై మరియు హైదరాబాద్ తో సమ ఉజ్జీలు గానే కొనసాగుతున్నప్పటికీ, వారి నెట్ రన్ రేట్ మూలాన వారు ఐదవ స్థానానికి పరిమితయ్యారు. ఇక ఢిల్లీ, బెంగళూరు, పంజాబ్, గుజరాత్ మరియు ముంబై జట్టులు ప్లేఆఫ్ రేస్ నుండి దాదాపు వైదొలగినప్పటికీ, ఇంకా ఎలిమినేట్ అవ్వలేదు.
ముంబై మరియు గుజరాత్ జట్టులు ఇంకా ఎలిమినిట్ అవ్వనప్పటికీ, వారి ప్రస్తుత ఆట తీరు చూస్తుంటే వారు ఆ రేస్ నుండి తప్పకనే తప్పుకున్నట్టే. అదే క్రమం లో పంజాబ్ మరియు ఢిల్లీ జట్టులు సైతం ఇంకా ఎలిమినేట్ అవ్వనప్పటికీ, వాటికి మిగిలిన అన్ని మ్యాచ్ ల లో ను వారు నెగ్గి, ఇతర జట్టుల మ్యాచ్ ఫలితం మీద కూడా ఆధారపడుతారు.
ఇక ప్రతి సీజన్ లోను ఫేవరేట్ గా దిగే బెంగళూరు మరోసారి ఆ జట్టు అభిమానులకు నిరాశనే మిగిల్చేలా కనపడుతుంది. ఇంకా వారు టోర్నీ నుండి నిష్క్రమించనప్పటికీ, వారి తీరే వేరు అన్నట్టు, వారి ప్లే ఆఫ్ అవకాశాలు వారి చేతులో లేవు.ఆ జట్టు మిగిలిన అన్ని మ్యాచ్ ల లో గెలిచినప్పటికీ, వారి క్వాలిఫికేషన్ అనేది నిశ్చయం కాదు. వారు గెలిచి, పక్క జట్టులు సైతం వారికి మద్దతిచ్చే ఫలితాలు రావాలి. గత మూడు మ్యాచ్ ల లోను గెలిచినప్పటికీ, ఆకులు కాలాక చేతులు పట్టుకుని ప్రయోజనమేమిటి అన్నట్లు, వారు సైతం ఈ ఐపీఎల్ 2024 నుండి వైదొలగినట్లే.
ఏది ఏమైనప్పటికి, ఈ సంవత్సరం ఐపీఎల్ ఎన్నో రికార్డు లకు వేదికగా మారింది. అభిమానులకు ఆసక్తిని రెట్టించేలా ఎన్నో మ్యాచ్లు ఈ ఐపీఎల్ లో చోటుచేసుకున్నాయి. ఇక ఇన్ని రికార్డు లకి పేరిటగా నిలిచిన ఈ ఐపీఎల్ 2024 కు విజేతలు గా ఎవరు నిలుస్తారోనని ఫాన్స్ ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. ఐపీఎల్ 2023 ను చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకున్నారు. ఫాన్స్ అందరు ప్లే ఆఫ్స్ కు తమ జట్టు వెళుతుందా లేదా అని వేచి చూస్తున్నారు. చూడాలి మరి ఏ జట్టులు ప్లే ఆఫ్స్ కు అర్హత ను సాధిస్తాయోనని.




