లోకేష్‌ వద్దకు ఇప్పాల రవీంద్ర రెడ్డి.. హవ్వ!

Ippala Ravindra Reddy Poses With Nara Lokesh

వైసీపీ సోషల్ మీడియా సైకోలలో ఒకడైన ఇప్పాల రవీంద్ర రెడ్డి ఇదివరకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్ కళ్యాణ్‌లని అవహేళన చేస్తూ ఎన్ని పోస్టులు పెట్టారో టీడీపీలో అందరికీ తెలుసు.

అలాంటి వ్యక్తి సిస్కో కంపెనీ ప్రతినిధులతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునే కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్‌ని కలిశారు!

ADVERTISEMENT

అతనే తమపై సోషల్ మీడియాలో పోస్టులు వ్యక్తి అని నారా లోకేష్‌ గుర్తించకపోయి ఉండొచ్చు. కానీ నారా లోకేష్‌ టీమ్‌కి ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా? ఇటు ప్రభుత్వంలో, అటు టీడీపీలో కూడా కీలక వ్యక్తిగా ఉన్న నారా లోకేష్‌ని కలిసేందుకు వస్తున్నవారు ఎవరూ?ఎటువంటివారు? అని పరిశీలించకుండానే ఇప్పాలని నారా లోకేష్‌ వద్దకు అనుమతించారు.

దీనిపై సోషల్ మీడియాలో టీడీపీ మద్దతుదారులు ఆక్షేపించేవరకు కూడా నారా లోకేష్‌ టీమ్‌ మేల్కోకపోవడం ఇంకా విచిత్రం. చివరికి మంత్రి నారా లోకేష్‌ దృష్టికి ఈ విషయం రావడంతో అందరికీ చివాట్లు పెట్టారు.

అటువంటి బ్యాక్ గ్రౌండ్, అన్ని కేసులున్న ఇప్పాల రవీంద్ర రెడ్డిని సిస్కో కంపెనీ గుర్తించలేకపోతే పోయే.. కానీ నారా లోకేష్‌ టీమ్‌ కూడా గుర్తించలేకపోతే సిగ్గుచేటే కదా?

మంత్రి నారా లోకేష్‌ గట్టిగా అందరికీ చీవాట్లు పెట్టిన తర్వాత వారు మేల్కొని సిస్కో కంపెనీకి ఓ లేఖ వ్రాశారు. దానిలో ఇప్పాల చరిత్రని వివరించి అతనిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ప్రభుత్వం-సిస్కో మద్య జరిగే సమావేశాలు, కార్యక్రమాలకు, అలాగే రాష్ట్రానికి దూరంగా ఉంచాలని సూచించారు.

గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఇటీవలే సిస్కో టీమ్‌ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసింది. అయితే ఇప్పాల రవీంద్ర రెడ్డి గురించి తెలుసుకున్న రేవంత్ రెడ్డి టీమ్‌ అతనిని ఆ కార్యక్రమానికి అనుమతించలేదు.

పొరుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిబ్బంది ఇప్పాల ఘన చరిత్రని ముందే తెలుసుకొని దూరంగా ఉంచారు. కానీ తమని దూషించి, అవహేళన చేసి అందుకు పోలీస్ కేసులు కూడా ఎదుర్కొన్న ఇప్పాలని నారా లోకేష్‌ టీమ్‌ గుర్తించకపోవడమే విచిత్రంగా ఉంది కదా?టీడీపీ మద్దతుదారులు, పార్టీ అభిమానులు అసహనం వ్యక్తం చేశారంటే చేయరూ?

ADVERTISEMENT
Latest Stories