ఇరాన్‌ ఇలా చేస్తోందేమిటి?

Iran Leadership Crisis May Escalate Donald Trump War Tensions

ఇంతకాలం అమెరికా దాని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ప్రపంచ దేశాల పాలిట విలన్‌గా పేరు సంపాదించుకున్నారు. ఇరాన్‌తో యుద్ధం మొదలుపెట్టిన తర్వాత ఆయన అహంకారపు విశ్వరూపాన్ని యావత్ ప్రపంచం చూడగలుగుతోంది.

ఇరాన్‌ ఆయన బాధిత దేశం కనుక దానిపై ప్రపంచదేశాలకు సానుభూతి ఉంది. అలాగే అమెరికా, ఇజ్రాయెల్ వంటి అత్యంత శక్తివంతమైన దేశాలను ఒంటరిగా ఎదుర్కొంటున్న దేశంగా గొప్ప పేరు సంపాదించుకుంది.

ADVERTISEMENT

అమెరికా దాని అధ్యక్షుడు ట్రంప్‌పై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్‌ అమలు చేస్తున్న రకరకాల యుద్ధ, దౌత్య వ్యూహాలకు సర్వత్రా ప్రశంశలు లభిస్తున్నాయి.

హోర్మూజ్ జలసంధిని దిగ్బంధనం చేసి, ప్రపంచదేశాలకు చమురు కష్టాలు తెచ్చిపెడుతున్నప్పటికీ, ఇదివరకు ఎన్నడూ ఆవిధంగా చేయని ఇరాన్‌ ఇప్పుడు అలా ఎందుకు చేస్తోందో అర్థం చేసుకున్న ప్రపంచ దేశాలు సానుభూతితో సర్దుకుపోతున్నాయి.

ఇరాన్‌ సుప్రీం లీడర్ ఖోమైనీ తర్వాత అయన కుమారుడు ఇరాన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే దాదాపు గత నెల రోజులుగా ఇరాన్‌ ఒకే నాయకత్వంలో పని చేస్తున్నట్లు చాలా చక్కగా సాగుతూ ప్రపంచ దేశాల మన్ననలు పొందింది.

కానీ ఇప్పుడు ఇరాన్‌ నాయకత్వంలో చీలికలు రావడం వల్లనే మిత్రదేశమైన భారత్‌ చమురు నౌకలను నిర్బందించడం, నేడు మూడు దేశాల చమురు నౌకలపై ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్ దాడులు చేయడం, సౌదీ అరేబియాతో సహా పలు గల్ఫ్ దేశాలకు అత్యంత కీలకమైన హోర్మూజ్ జలసంధిలో ఇంటర్నెట్ కేబుల్స్ ధ్వంసం చేస్తామని ఇరాన్‌ బెదిరింపులు దానిపై ప్రపంచ దేశాలకు సానుభూతి తగ్గేలా చేస్తున్నాయి. ఇంతకాలం ట్రంప్‌ని నిందిస్తున్న ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇరాన్‌ని వేలెత్తి చూపిస్తున్నాయి.

నాయకత్వంలో చీలిక వల్లనే చర్చల విషయంలో నిర్ణయం తీసుకోలేక తప్పుకొని ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

కనుక ఇరాన్‌ నాయకత్వంలో చీలికల వలన దాని ధోరణిలో ఈ ఆకస్మిక మార్పులు వాటి వలన మళ్ళీ యుద్ధం ఆరంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కనుక ఇంతకాలం ట్రంప్‌ తలతిక్కతనం, అహంభావం వల్లనే ఈ యుద్ధం జరిగితే, ఇకపై ఇరాన్‌ నాయకత్వంలో చీలికల వలన యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. ఇది ఇరాన్‌తో సహా ఎవరికీ మంచిది కాదు.

ADVERTISEMENT
Latest Stories