మత రాజకీయాలకు జగన్‌ పునాది వేస్తున్నారా?

ys-jagan-visit--tirumala

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నిలువునా కూరుకుపోయిన వైసీపి అధినేత జగన్‌ దానిలో నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నానని అనుకొంటూ దానిలో ఇంకా లోతుకి కూరుకుపోతున్నారు. నేడు జగన్‌ తిరుమల పర్యటన రాజకీయం కోసమే అని అర్దమవుతూనే ఉంది.

తిరుమల పవిత్రతకి, ప్రతిష్టకి భంగం కల్గించినందుకే మండిపడుతున్న ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల ప్రజలు, నేడు జగన్‌ తన దండుని వెంటబెట్టుకొని తిరుమల కొండపైకి దండయాత్రకి బయలుదేరుతుండటాన్ని తప్పు పట్టకుండా ఉంటారా?

ADVERTISEMENT

జగన్‌ అధికారం కోల్పోయినా అరాచక ధోరణి వీడటం లేదనే భావన ప్రజలలో కనిపిస్తోంది. నేడు జగన్‌ బ్యాచ్ తిరుమలలో ఏమాత్రం అతి చేసినా జగన్‌ హిందూ వ్యతిరేకి ముద్ర పడుతుంది.

అయితే జగన్‌ తిరుమల పర్యటనపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తాయి. “జగన్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తుని, కోనసీమలో విధ్వంసం సృష్టించారు. ఇప్పుడు తిరుమల పర్యటనతో రాష్ట్రంలో మత చిచ్చు రగిలించాలని ప్రయత్నిస్తున్నారు.

కనుక ప్రజలందరూ జగన్‌ వ్యవహార శైలిని నిశితంగా గమనిస్తూ, ఆ పార్టీ ఉచ్చులో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. తిరుమల శ్రీవారిపై తనకు నమ్మకం, భక్తి ఉన్నాయని జగన్‌ డిక్లరేషన్ పత్రంపై సంతకం చేస్తారా లేదా? చేయకపోతే ఏం చేయాలనేది టీటీడీ చూసుకుంటుంది.

కనుక జగన్‌ మతాన్ని, ఆయన తిరుమల పర్యటన గురించి ఎవరూ మాట్లాడవద్దు,” అని ప్రజలకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు పవన్‌ కళ్యాణ్‌ విజ్ఞప్తి చేశారు.

జగన్‌ ఏపీలో మత చిచ్చు రగిలించేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్‌ కళ్యాణ్‌ చాలా స్పష్టంగా చెప్పేశారు. మత రాజకీయాలు చేసే పార్టీ ఏదంటే బీజేపీ అని ఎవరైనా టక్కున సమాధానం చెపుతారు. అంటే జగన్‌ వెనుక బీజేపీ ఉందా?అనే సందేహం కలుగకమానదు.

జగన్‌ ఈ సమస్యలో నుంచి బయటపడేందుకు ప్రయత్నించకపోగా, టిడిపి కంటే ఎక్కువగా దీనిపై చర్చ కొనసాగేలా చేస్తుండటం గమనిస్తే ఏపీలో మత రాజకీయాలకు జగన్‌ బలమైన పునాదులు నిర్మిస్తున్నట్లే అనుమానం కలుగుతోంది.

కానీ తిరుమల వెంకన్న స్వామితో రాజకీయాలు చేస్తే ఏమవుతుందో ఇప్పటికే వైసీపి ఓటమితో జగన్‌ గ్రహించి ఉండాలి. కానీ గ్రహించలేదని నేడు తిరుమల పర్యటనతో స్పష్టం అవుతోంది.

అన్య మతస్తుడినైన తనపై తిరుమల స్వామివారు ఎటువంటి ప్రభావం చూపలేరని జగన్‌ భావిస్తున్నట్లున్నారు. ఆ ధీమాతోనే నేడు తిరుమలపైకి దండయాత్రకి బయలుదేరుతున్నట్లు భావించవచ్చు. కనుక ఇక జగన్‌, వైసీపి సంగతి ఆ స్వామివారే చూసుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories