జగన్‌ బయటకి వచ్చారు కానీ…

vallabhaneni-vamsi-roja-perni-nani-ambati-rambabu-kodali-nani

విజయవాడ ప్రజలు నాలుగు రోజులుగా వరదలతో అల్లాడిపోతున్నా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పట్టించుకోలేదు? ప్రజల వద్దకు ఎందుకు రాలేదు? అని ప్రశ్నిన్న జగన్, వైసీపి సొంత మీడియాకి తమ పార్టీ నేతలు ఎవరూ ఎందుకు రావడం లేదని ప్రశ్నించుకుంటే బాగుండేది.

ADVERTISEMENT

జగన్‌ విజయవాడలో పర్యటిస్తుంటే, మాజీ మంత్రి రోజా ఇంట్లో కూర్చొని చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే కనీసం ఆమె ఆవిదంగానైనా ప్రజలకు కనబడ్డారు. వైసీపిలో మిగిలిన నేతలందరూ ఎక్కడున్నారో… ఏం చేస్తున్నారో… జగన్‌కే తెలియాలి.

దాదాపు మూడు నెలలుగా ప్రజల మద్యకు రాని జగన్‌, పోగొట్టుకున్న గౌరవం తిరిగి సంపాదించుకునేందుకు, లండన్‌ యాత్రని వాయిదా వేసుకొని ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.

కానీ ఒకప్పుడు ప్రతీరోజూ ప్రజల మద్యన కనిపించే వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్, విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వైసీపి సీనియర్ నేతలందరూ ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలీదు.

పదవి, అధికారం ఉంటేనే వైసీపి నేతలు ప్రజల మద్యకు వస్తారా లేకుంటే రారా?అనే సందేహం కలుగుతుంది. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీ నేతలందరూ నిత్యం ప్రజల మద్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూండేవారు.

కానీ వైసీపి నేతలు సమయం దొరికింది కదాని తమ వ్యాపారాలపై దృష్టి పెట్టి పని చేసుకుంటున్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకి ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చినందునే కనబడుతున్నారు లేకుంటే ఆయన కనపడేవారు కారేమో? టిడిపి కూటమి ప్రభుత్వానికి ఇంకా ‘హనీమూన్ పీరియడ్’ పూర్తికాక మునుపే ఇటువంటి అగ్నిపరీక్షలు ఎదుర్కొంటోంది. కానీ మూడు నెలలు కావస్తున్నా వైసీపి నేతలు బయటకు రావడం లేదు. ఎందుకు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వస్తారు?

ADVERTISEMENT
Latest Stories