జగన్, విజయ్ ని ఫాలో అవుతున్నారా.?

jagan-follows-vijays-astrology-route

తమిళనాడు ఎన్నికల ఫలితాల విడుదల తరువాత ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ రాజకీయం రంగు మార్చుకుంటుంది. నిన్న మొన్నటి వరకు ఐప్యాక్ రాజకీయాలను నమ్ముకున్న జగన్ ఇక ఇప్పుడు జోతిష్యులను నమ్ముకునే స్థాయికి వచ్చారా అనేలా జగన్ తాడేపల్లి ప్యాలస్ లో రాజకీయాలు జరుగుతున్నాయి.

తమిళనాడు లో టీవీకే అనూహ్య విజయం వెనుక, విజయ్ ముఖ్యమంత్రి పీఠం వెనుక ఆయన వ్యక్తిగత జోతిష్యుడు రిక్కీ రాధాన్ పండిట్ హస్తం ఉందంటూ విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ 2.0 కోసం జగన్ కూడా అదే బాటలో పయనించేందుకు చండీగఢ్ కు చెందిన ప్రముఖ ఆస్ట్రాలజర్ రుద్ర కరణ్ ప్రతాప్ ను తాడేపల్లి కి రప్పించారు.

ADVERTISEMENT

దీనితో జగన్ కూడా విజయ్ మాదిరి రాబోయే ఎన్నికలలో వైసీపీ ని అధికార పీఠం ఎక్కించేందుకు ఐ ప్యాక్ ను వదిలి జోతిష్యులను నమ్ముకున్నారా అంటూ చర్చ మొదలయ్యింది. ఇప్పటి వరకు విజయ్, జగన్ ని ఫాలో అవుతున్నారు అంటూ ప్రచారం చేసుకుంటున్న వైసీపీ ఇప్పుడు రివర్స్ లో జగన్, విజయ్ ని ఫాలో అవుతున్నారా అంటూ ప్రశ్నలను ఎదుర్కొంటుంది.

2024 లో వైసీపీ కి అధికారాన్ని అందించలేని ఐ ప్యాక్ 2029 లో జరగబోయే ఎన్నికలలో జగన్ ను ముఖ్యమంత్రిని చెయ్యగలుగుతుందా.? అందుకే జగన్ రూట్ మార్చి జోతిష్యులను నమ్ముకున్నారా.? 2019 లో వైసీపీ రాజకీయ వ్యూహాలు, కోడికత్తి సెంటిమెంట్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కొత్త కాబట్టి ఇటు ప్రజలు అటు ప్రత్యర్థి పార్టీల నేతలు అవహగానా చేసుకోవడంలో కాస్త ఆలస్యం చేసారు.

కానీ 2024 నాటికి వైసీపీ సోషల్ మీడియా వినూత్న ప్రచారాలు, ఐ ప్యాక్ హంగామాలు, గులకరాయి సెంటిమెంట్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిచితమైపోయాయి. ఇది కూడా వైసీపీ ఘోర ఓటమికి ఒక ముఖ్య కారణంగా భావించవచ్చు. అయితే ఇప్పుడు జగన్ వాటన్నిటిని పక్కన పెట్టి కొత్తగా జాతక చక్రాల ఆధారంగా, జోతిష్యుల సలహాల మేర రాజకీయం చేయనున్నారా.?

ADVERTISEMENT
Latest Stories