నరసాపురంలో గోకరాజు… మరి రఘురామ కృష్ణరాజు?

Raghu Rama Krishna Rajuగత ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా రఘురామ కృష్ణరాజు పోటీ చేసి గెలిచారు కానీ ఆయన వలన వైసీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ. ఆయన పార్టీని వీడకుండా ఎంపీగా కొనసాగుతూనే నిత్యం “మా ప్రభుత్వ అవినీతి… మా ముఖ్యమంత్రి అవినీతిపరుడు…” అంటూ వైసీపీ ప్రభుత్వం గురించి సిఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలు, ఆరోపణలు, కోర్టు కేసులతో పక్కలో బల్లెంలా తయారయ్యారు.

మరో ఏడాదిన్నర వరకు ఎన్నికలు లేవు గనుక అంతవరకు రఘురామ చిక్కడూ దొరకడూ అన్నట్లు ఢిల్లీలో కూర్చొని జగన్‌ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు, ఆరోపణాలైనా చేయవచ్చు. కానీ ఒకసారి ఎన్నికల గంట మ్రోగితే ఆయన పరిస్థితి ఏమిటి? అనే సందేహం కలుగక మానదు.

ADVERTISEMENT

ఎందుకంటే ఆయన వైసీపీ నుంచి పోటీ చేయలేరు. టిడిపిలో చేర్చుకొంటుందో లేదో తెలీదు. ఎందుకంటే ఆ పార్టీలో ఒక్కో స్థానానికి కనీసం ఇద్దరు ముగ్గురు పోటీ పడుతుంటారు. ఇక బిజెపికి ఆయన అక్కరలేదు. ఒకవేళ కావాలని అనుకొని ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆయనపై ఈగ వాలకుండా చూసుకొని ఉండేది. ఇక మిగిలింది జనసేన పార్టీ. ఆ పార్టీ టిడిపి, బిజెపిల మద్య ఊగిసలాడుతోంది. వాటిలో దేనితో పొత్తులు పెట్టుకొన్నా నరసాపురం లోక్‌సభ స్థానంలో ఎవరు పోటీ చేయాలో అవే నిర్ణయిస్తాయి.

ఇటువంటి పరిస్థితులలో ఎంపీ రఘురామ కృష్ణరాజు నరసాపురం నుంచి మళ్ళీ ఎలా పోటీ చేస్తారు?ఏ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తారు? అసలు వైసీపీ ప్రభుత్వం ఆయనని నామినేషన్ అయినా వేయనిస్తుందా?ప్రచారం చేసుకోనిస్తుందా?కుదరకపోతే ఎంపీగా కొనసాగలేరు. అప్పుడు ఆయన పరిస్థితి ఏమిటి? అనే సందేహాలకు ఆయనే సమాధానం చెప్పాలి.

తాజా సమాచారం ప్రకారం నరసాపురం నుంచి ఈసారి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుమారుడు గోపరాజు రంగరాజుని వైసీపీ అభ్యర్ధిగా బరిలో దింపాలని సిఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక ఇప్పుడు టిడిపి, బిజెపి, జనసేనలే ఆలోచించుకోవాలి… అక్కడి నుంచి ఎవరిని బరిలో దింపాలో?ఇక రఘురామ కృష్ణరాజు ఏం చేస్తారో?

ADVERTISEMENT
Latest Stories