ఒకటో తేదీ వస్తోంది..జగన్ మళ్ళీ ఢిల్లీకి

jagan going to delhi againప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ప్రతీ నెల ఒకటో తేదీ కోసం ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. పరిమితమైన వారి ఆదాయంలోనే కుటుంబాలను పోషించుకోవలసి ఉంటుంది కనుక ఒకటో తేదీన అందే జీతాల కోసం వారు ఆత్రంగా ఎదురుడటం సహజమే.

అయితే ఏపీ ప్రభుత్వ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. సంక్షేమ పధకాల భారం కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటోంది. కనుక ఒకటో తేదీ వస్తోందంటే, వివిద పధకాలకు, పింఛన్లకు, లక్షలాదిమంది ప్రభుత్వోద్యోగులకు జీతాల చెల్లింపులకు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల కోసం ప్రభుత్వం జేబులు తడుముకోవలసివస్తోంది.

ADVERTISEMENT

కనుక ప్రతీ నెల ఒకటో తేదీ వస్తోందంటే ట్రెజరీ అధికారులకు ముచ్చెమటలు పడుతుంటాయి. కానీ ఆదాయం సమకూర్చుకోవడం వారి చేతిలో లేదు కనుక రెవెన్యూ, వాణిజ్య, రిజిస్ట్రేషన్స్ తదితర శాఖల నుంచి వచ్చే ఆదాయం కోసం, అలాగే కేంద్రం పన్నులో రాష్ట్ర వాటా కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.

ఈ పరిస్థితులలో నిధులు, కొత్త అప్పుల కోసం సిఎం జగన్మోహన్ రెడ్డి తరచూ ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులను కలిసి రావలసివస్తోంది. మూడు వారాల క్రితమే ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులను కలిసి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. సిఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం మళ్ళీ ఢిల్లీ బయలుదేరుతున్నారు.

న్యాయవ్యవస్థలో మౌలికవసతుల కల్పనపై రేపు ఢిల్లీలో జరుగబోయే సదస్సులో సిఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. తరువాత ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబందించిన పలు అంశాలపై చర్చిస్తారు. అంటే నిధులు, అప్పుల గురించే కదా?

ADVERTISEMENT
Latest Stories