చేతికి ఎముక ఉండదట… సింపతీ & సెంటిమెంట్..!

Jagan on andhra pradesh state financial crisisఅప్పుల ఊబిలో ఏపీ కూరుకుపోవడానికి కారణమవుతోన్న ప్రస్తుత పాలక వర్గంపై కేంద్ర ప్రభుత్వం నుండి స్థానిక నేతల వరకు అందరూ విమర్శల వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి అత్యంత కీలకమైన అంశాలను పక్కనపెట్టి, వినోదానికి ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తూ గడిచిన నెల రోజులుగా ఏపీ సర్కార్ పనితీరుపై బహిరంగంగానే విమర్శలు వెలువడుతున్నాయి.

వైసీపీ నేతలు బూతులతో ఎంతగా డిఫెండ్ చేసుకున్నా ఈ ఒరవడి ఆగకపోవడంతో, స్వయంగా సీఎం రంగంలోకి దిగినట్లున్నారు. అయితే ఈ సారి ఎదురుదాడి కంటే కూడా ఎక్కువగా సెంటిమెంట్ మరియు సింపతీని నమ్ముకున్నట్లుగా కనపడుతోంది. ఓ పక్కన రాష్ట్రంలో ఆదాయం లేదంటూనే మరో పక్కన తన ఉదార స్వభావం గురించి తనకు తానుగా సీఎం హైలైట్ చేసుకున్నారు.

ADVERTISEMENT

రాష్ట్ర ఆదాయం ప్రతి ఏడాది పెరుగుతూ పోతుంది, కానీ గడిచిన రెండేళ్లుగా రాష్ట్ర ఆదాయం పెరగకపోగా తగ్గుతూ వస్తోంది. ఇది ఒకసారి గమనించండి అంటూ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఏపీ పరిస్థితిని అర్ధం చేసుకోవాల్సిందిగా సెంటిమెంటల్ గా మాట్లాడారు.

మామూలుగానే ‘నా చేతికి ఎముక ఉండదు’ అని కూడా అంటా ఉంటారు,ఉదారంగా, మానవత్వంగా ఉండే విషయంలో నా కన్నా బాగా స్పందించే వాళ్ళు, నా కన్నా ఎక్కువగా స్పందించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎక్కడ కూడా మంచే చేయాలని తాపత్రయ పడతాను అంటూ తన వైపు సింపతీ వచ్చేలా, కెమెరా వైపు చూసి కూడా మాట్లాడలేకపోయారు.

సహజంగా చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడుతూ భీకరమైన స్వరంతో స్పందించే జగన్, తన రొటీన్ స్పీచ్ లకు విరుద్ధంగా నెమ్మదిగా ఆచితూచి మాట్లాడడం విశేషం. ఉద్యోగస్తుల పీఆర్సీ విషయంలో ప్రభుత్వం తన నిస్సహాయతను చాటుకుంటుందన్న వార్తల నేపథ్యంలో… ప్రజలతో పాటు ఉద్యోగస్తులు కూడా పెద్ద మనసు చేసుకుని అర్ధం చేసుకోవాలని ఏపీ సీఎం భావిస్తున్నారేమో!?

ADVERTISEMENT
Latest Stories