అమ్మ అప్ డేట్స్… హుషారులో అభిమానులు..!

jaya-healthతమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత హెల్త్ బులెటిన్ ను చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. జయలలితకు ఫిజియో థెరపీ చేయిస్తున్నామని వైద్యులు బులెటిన్ లో స్పష్టం చేయడంతో ‘అమ్మ’ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. వెంటిలేటర్ ద్వారా శ్వాస తీసుకుంటున్న ఆమెకు కొత్త కిట్ ను అమర్చామని, రెస్పిరేటరీ విధానంలో ఆమె శ్వాస తీసుకునేలా ఉంచామని అన్నారు.

కాగా, జయలలిత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు డీఎంకే నేత స్టాలిన్ ఆసుపత్రికి వచ్చారు. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకుని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఈ రోజు మరో తమిళ నేత వైగో కూడా ఆసుపత్రికి వచ్చారు. ఆమె కోలుకుంటున్న పరిస్థితుల్లో ఇన్ టర్మ్ సీఎం ను నియమించాల్సిన అవసరం లేదని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories