పదవులు, అధికారం శాశ్వితం కాదని ఆ రెండూ కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి రోజూ చెపుతూనే ఉన్నారు. అయితే ఇదే విషయం అధికారంలో ఉన్నప్పుడు జగన్‌తో సహా వైసీపిలో ఎవరూ గుర్తుపెట్టుకోలేదు. అందుకే ఆనాడు టిడిపి నేతలని కార్యకర్తలని వేధించారు. వారి పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారు. గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే వైసీపి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ఆయన అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేసి కొందరిని అరెస్ట్ చేశారు కూడా.
Also Read – బిఆర్ఎస్‌కి చాతకాక చంద్రబాబుని నిందిస్తే ఎలా?
తర్వాత మంగళగిరి టిడిపి కార్యాలయంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ సురేష్, వైసీపి నేత దేవినేని అవినాష్ తదితరులపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్‌ని ఇప్పటికే పోలీస్ స్టేషన్‌కి పిలిపించి రెండుసార్లు విచారణ జరిపారు. కనుక ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని వారు కూడా గ్రహించారు.
కనుక వారు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు నిరాకరించింది. ఇటువంటి కేసులలో ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. కనీసం సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునే వరకు పోలీసులు తమని అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని వారి తరపు న్యాయవాది హైకోర్టుకి విజ్ఞప్తి చేశారు. దానిపై బుధవారం మధ్యాహ్నం తమ నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు చెప్పింది. ఒకవేళ హైకోర్టు వారికి ఆ అవకాశం ఇవ్వకపోతే జోగి రమేష్‌తో సహా అందరినీ పోలీసులు అరెస్ట్ చేయడం ఖాయమేనని భావించవచ్చు.
Also Read – జోగీ జోగీ రాసుకుంటే… ఢిల్లీలో అయినా బూడిదే రాలుతుంది!
అధికారంలో ఉన్నప్పుడు పేట్రేగిపోయిన వైసీపి నేతలకు ఆ అధికారం కోల్పోతే ఇలా జరుగుతుందని తెలియదనుకోలేము. కానీ మళ్ళీ మనమే అధికారంలోకి వశాము… మరో 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటామనే జగన్ మాటలని గుడ్డిగా నమ్మి, ఆ ధీమాతోనే చెలరేగిపోయారు. ఆనాడు వారు ఆవిదంగా దౌర్జన్యాలకు పాల్పడకపోయి ఉండి ఉంటే నేడు ఇలా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ప్రాధేయపడాల్సిన అవసరమే ఉండేది కాదు కదా?
అయినా జగన్‌ని నమ్మినవారు ఎవరు బాగుపడ్డారని? అందరూ ఏదో కేసులో ఇరుకొని పోలీస్ స్టేషన్‌లు, కోర్టులు చుట్టూ ఇలా తిరుగుతూనే ఉన్నారు కదా?