అప్పుడు వైలెన్స్..ఇప్పుడు సైలెన్స్…!

jogi-ramesh-devineni-avinash

గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ అండ చూసుకుని అధికారం ఉంది అనే అహంకారంతో వైలెన్స్ తో రెచ్చిపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు ఒక్కసారిగా సైలెన్స్ లోకి జారుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా జోగి రమేష్ విషయానికి వస్తే గత ఐదేళ్లు ఈయన గారు చేసిన అరాచకానికి టీడీపీ కార్యకర్తలే కాదు సాధారణ పౌరుడు సైతం విసిగిపోయారు.

జగన్ మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకు కర్రలతో దాడికి యత్నించారు జోగి. అంతేకాదు మైకు కనిపిస్తే చాలు పవన్, బాబు, లోకేష్ టార్గెట్ గా చెవులు వినలేనంత దారుణమైన భాషతో రెచ్చిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే చర్యలకు భయపడి ప్రభుత్వానికే కాదు ప్రజలకు కూడా కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు.

ADVERTISEMENT

అలాగే దేవినేని అవినాష్ టీడీపీ పార్టీ నుండి వైసీపీలోకి జంప్ కొట్టిన ఈయన గారు ఏకంగా తన దగ్గరున్న కిరాయి మూకను వెంటేసుకుని జగన్ మీద తనకున్న స్వామి భక్తిని నిరూపించుకోవడానికి టీడీపీ కేంద్ర కార్యాలయంపై మీద దాడికి తెగబడ్డారు. ఇప్పుడు అదే కేసులో నిందితుడిగా న్యాయస్థానం ముందు చెక్కర్లు కొడుతున్నారు.

ఇక కొడాలి నాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే రాజకీయాలకు అంత మంచిది అన్నట్లుగా గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికారిక భాషను అనధికారికంగా మార్చిన ఘనుడు ఈ మాజీ మంత్రి గారు. నందిగామ సురేష్, లేళ్ళ అప్పిరెడ్డి వంటి వైసీపీ నేతలందరూ కూడా తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైలెన్స్ తో రెచ్చిపోయినవారే.

అయితే ఇప్పుడు ఈ నాయకులంతా కూడా ఒక్కసారిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. అప్పుడు ప్రభుత్వాలు మారితే మన పరిస్థితి ఏమిటి అనే కనీస ముందు చూపు లేకుండా చేసిన వీరి అరాచకాలకు ఇప్పుడు ముందస్తు బైళ్ళు కావాలంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

అప్పుడు వైలెన్స్ తో రెచ్చిపోయిన వైసీపీ నాయకులు ఇప్పుడు సైలెంట్ అవుతుంటే అప్పుడు వీరి అడుగులకు మడుగులు ఒత్తిన అధికారులు ఇప్పుడు అదే నాయకులను అరెస్టులు చేసి జైళ్లకు సాగనంపుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories