
వైసీపీ హయాంలో 5 ఏళ్ళ పాటు కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమంగా ఆఫ్రికా దేశానికి రవాణా అవడం ఆ తర్వాత కధలు అందరికీ తెలుసు.
Also Read – విద్యార్థుల ఆత్మహత్యలు…పాపం ఎవరిదీ.?
అయితే రాష్ట్రంలో అవసరానికి మించి బియ్యం పండుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చేయవచ్చో తెలంగాణ ప్రభుత్వం నిరూపించి చూపించింది. గత ఖరీఫ్ సీజనులో తెలంగాణలో 153 లక్షల టన్నులు బియ్యం పండగా రాబోయే సీజనులో మరో 122 లక్షల టన్నులు బియ్యం చేతికి అందబోతోంది.
కనుక అవసరానికి మించిన ఉత్పత్తి అవుతున్న ఈ బియ్యాన్ని ఫిలిపిన్స్ దేశానికి ఎగుమతి చేసేందుకుగాను ఫిలిపిన్స్ ప్రభుత్వంతో 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతికి ఒప్పందం చేసుకుంది.
Also Read – గంట అరగంట వీరులకు అర్దమైంది కానీ దువ్వాడకు అర్ధం కాలే.. అందుకే..
మొదటి విడతగా సోమవారం ‘కాకినాడ పోర్టు నుంచే’ రూ.45 కోట్లు విలువగల 12,500 టన్నుల బియ్యం ఎగుమతికి ఆ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. వియత్నాంకు చెందిన షిప్పులో ఈ బియ్యాన్ని ఫిలియిన్స్ దేశానికి ఎగుమతి చేస్తోంది.
జగన్ ప్రభుత్వం కాకినాడ పోర్టుని అక్రమ రేషన్ బియ్యం ఎగుమతికి ఉపయోగించుకుంటే, తెలంగాణ ప్రభుత్వం అదే పోర్టు నుంచి మిగులు బియ్యాన్ని విదేశానికి ఎగుమతి చేసి ఆదాయం సమకూర్చుకుంటోంది. అంతే కాదు.. ఈవిదంగా తెలంగాణ రైతులకు మహోపకారం కూడా చేస్తోంది. తెలంగాణకు సొంతంగా పోర్టు లేకపోయినా కాకినాడ పోర్టుని వినియోగించుకొని లబ్ధి పొందుతోంది.
Also Read – కాంట్రవర్సీ లో కీరవాణి?
బియ్యం దొంగలపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోగలదో లేదో తెలీదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడికక్కడ పోర్టులున్నప్పుడు, అవసరానికి మించి బియ్యం పడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈవిదంగా విదేశాలకు బియ్యం ఎగుమతి చేయవచ్చు కదా?
బియ్యం విదేశాలకు ఎగుమతి చేసి దళారులు, వ్యాపారులు , వైసీపీ నేతలు డబ్బు సంపాదించుకోగలుగుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఎగుమతి చేసి ఆదాయం సమకూర్చుకోవచ్చు కదా?తద్వారా రాష్ట్రంలో వరి పండిస్తున్న రైతులకు మేలు కలుగుతుంది కదా?