నిప్పులు చెరిగిన ‘నైట్ రైడర్స్’ కెప్టెన్!

Kashmir CRPF Jawan - Kashmir - Gambhir Tweetపాకిస్థాన్ కు మద్దతు తెలుపుతూ, రాళ్లు రువ్వుతూ అల్లర్లకు పాల్పడుతున్న ముష్కరులపై ఇండియన్ క్రికెటర్ మరియు కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ… కాశ్మీర్ ముమ్మాటికీ మాదేనని తెగేసి చెప్పాడు. స్వాతంత్ర్యం కావాలనుకునేవారు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్లర్లో గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. భారతదేశపు జెండాలోని మూడు రంగులకు సరికొత్త అర్థాన్ని వివరిస్తూ ట్వీట్లు చేసారు.

కాషాయం ఆగ్రహ జ్వాలలను సూచిస్తుందని, తెలుపు జీహాదీల శవాలపై కప్పే గుడ్డకు సంకేతమని, ఉగ్రవాదంపై ద్వేషాన్ని ఆకుపచ్చ రంగు సూచిస్తుందని చెప్పాడు. భారతీయ జవానును కొట్టే ఒక్కో దెబ్బకు కనీసం 100 మంది జీహాదీల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కశ్మీరులో ఉపఎన్నిక సందర్భంగా విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ పై అల్లరి మూకలు దాడి చేసిన వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే గౌతమ్ గంభీర్ నిప్పులు చెరిగాడు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories