దక్షిణాది ప్రజలలో 90 శాతం మందికి ఉత్తరాది రాష్ట్రాల గురించి, అక్కడి భాషలు, ఆయా రాష్ట్రాల జాతీయ నాయకులు, స్వతంత్ర సమర వీరుల గురించి అవగాహన ఉంది. కానీ ఉత్తరాదివారిలో 90శాతం మందికి దక్షిణాదిలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, అవేమిటో, అక్కడ ఏయే భాషలున్నాయో కూడా తెలీనివారున్నారు. అందుకే ఉత్తరాది రాష్ట్రాలలో తెలుగువాళ్ళని ‘మద్రాసీలు’ అని అనేవారు.
Also Read – ప్యాలస్‌లో ప్రతిపక్షం… సోషల్ మీడియాలో రాజకీయాలు!
అటువంటి వారందరికీ దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ అనే ఓ రాష్ట్రం ఉందని, దానిలో తెలుగువారు ఉంటారని తెలియజేసిన మహానుభావుడు స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు. అప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగు ప్రజలని గుర్తించడం మొదలుపెట్టారు.
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లో ఐటి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరగడంతో వాటి కోసం వచ్చే ఉత్తరాది యువత వలన తెలుగు భాష, తెలుగు రాష్ట్రాల గురించి ఉత్తరాది ప్రజలకు మరికొంత జ్ఞానం పెరిగి ఉండవచ్చు. కానీ నేటికీ చాలా మంది ఎన్టీఆర్ దగ్గరే ఆగిపోయిన్నట్లు సోనీలివ్ ఛానల్లో ప్రసారం అవుతున్న ‘కౌన్ బానేగా కరోడ్ పతీ’ క్విజ్ ప్రోగ్రామ్ చూస్తే అర్దమవుతుంది.
Also Read – ఒక్క ‘దేవర’ కే పట్టిన చిక్కా..?
అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న ఈ తాజా క్విజ్ షోలో వృద్ధ దంపతులు పాల్గొన్నారు. వారికి “ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు ఎవరు? ఆప్షన్స్: ఏ: పవన్ కళ్యాణ్, బి: చిరంజీవి, సి: నాగార్జున, డి: నందమూరి బాలకృష్ణ” అనే ప్రశ్న ఆప్షన్స్ ఇచ్చారు.
వారిలో ఆమె ‘ఎన్టీఆర్’ అని సమాధానం చెప్పబోయారు. అంటే ఎన్టీఆర్ ఇంకా బ్రతికే ఉన్నారని ఆమె భావిస్తున్నట్లు అర్దమవుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పగానే ఆమె టక్కున ‘ఎన్టీఆర్’ పేరు తలుచుకోవడం అందరికీ గర్వంగానే ఉంటుంది.
Also Read – ఐఏఎస్, ఐపీఎస్‌లకి ఆంధ్రా వద్దు.. తెలంగాణ ముద్దు!
కానీ ఆ దంపతులు ఇద్దరూ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ‘ఆడియన్స్ పోల్’ ఆప్షన్ తీసుకున్నారు. ఆడియన్స్‌లో ఎక్కువ మంది ‘ఏ: పవన్ కళ్యాణ్’ అని సూచించడంతో ఆ వ్యక్తి దానికే మొగ్గు చూపి రూ.1.60 లక్షలు గెలుచుకున్నారు.
కౌన్ బనేగా కరోడ్ పతి క్విజ్ ప్రోగ్రామ్‌లో పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్న అడగడం అందరికీ ముఖ్యంగా ఆయన అభిమానులకు చాలా సంతోషం కలిగే ఉంటుంది. కానీ ఈ క్విజ్‌లో పాల్గొన్నవారు వృద్ధులు కనుక ఇంత పాపులర్ నటుడు, రాజకీయ నాయకుడైన పవన్ కళ్యాణ్ వారికి తెలిసి ఉండకపోవచ్చని సరిపెట్టుకోవచ్చు.
కానీ గత కొన్ని దశాబ్ధాలుగా ఉత్తరాదివారు దక్షిణాది రాష్ట్రాలలో, అదేవిదంగా దక్షిణాదివారు ఉత్తరాది రాష్ట్రాలలో స్థిరపడుతున్నా ఇంకా దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు, భాషల గురించి ఉత్తరాదివారికి తెలుసుకోలేదని స్పష్టం అవుతోంది.