తెలంగాణ ఉద్యమాలు ఎవరు చేశారు? కేసీఆర్. తెలంగాణ ఎవరు సాధించారు? కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? కేసీఆర్! అంటూ బీఆర్ఎస్ పార్టీ చేత కేసీఆర్ ప్రమోషన్స్, పాలాభిషేకాలు చేయించుకొని మెల్లగా ‘తెలంగాణ జాతిపిత’ అయిపోయారు.
బీఆర్ఎస్ పార్టీ సృష్టించిన ఈ కృత్రిమ తుఫానులో “ఆయనొక్కరే ఎవరి సాయం లేకుండా పోరాడారా? సాధించారా?” అనే కాంగ్రెస్, బిజేపి నేతల ప్రశ్నలు గడ్డిపోచలా కొట్టుకుపోతుంటాయి.
సింహం ముసలిదైనా సింహమే. కనుక సెల్ఫ్ సర్టిఫైడ్ జాతిపితతో కనెక్ట్ అయ్యుండటం రాజకీయంగా చాలా అవసరం… అని ఆయన కూతురు కల్వకుంట్ల కవిత కాస్త ఆలస్యంగా గ్రహించినట్లున్నారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి మెడ పట్టుకొని బయటకు గెంటేసిన తర్వాత ఓ రెండు మూడు నెలలు తండ్రి ఫోటో, పేరు, కండువాలు, భజనతో కాలక్షేపం చేశారు.
కానీ అయన పట్టించుకోకపోవడంతో ‘కేసీఆర్ తాలూకా’వన్నీ తీసేసి సొంత ఫోటోతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. కానీ ముందే చెప్పుకున్నట్లు ‘కల్వకుంట్ల’ టైటిల్ వదులుకోవడానికే భయపడుతున్న కవిత, తండ్రి భజన మానుకుంటే తెలంగాణలో మనుగడ కష్టమని త్వరగానే గ్రహించారు.
కనుక మళ్ళీ ఇప్పుడు తండ్రి భజన మొదలుపెట్టారు. తండ్రికి క్లీన్ చిట్ ఇస్తూనే ఆయన చుట్టూ, దెయ్యాలు, భూతాలు, సమైక్యవాదులు ఉన్నారని విమర్శిస్తున్నారు. “నాడు ఉద్యమాల సమయంలో మనల్ని పోలీసుల చేత లాఠీలతో కొట్టించిన సమైక్యవాదులే ఇప్పుడు కేసీఆర్ పక్కన కూర్చోన్నారని,” కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
తద్వారా తాను కూడా తెలంగాణ ఉద్యమాలలో పనిచేశానని, లాఠీ దెబ్బలు తిన్నానని ప్రజలకు గుర్తు చేస్తున్నారనుకోవచ్చు. కానీ ఆమె చుట్టూ ఉన్నవారిలో ఎంత మంది ఉద్యమాలలో పనిచేశారు? అంటే జవాబు చెప్పడం కష్టం. కనుక ఉద్యమాలలో పాల్గొన్నారా లేదా అనేది ముఖ్యం కాదు.
కాస్త వయసు ఎక్కువుంటే చాలు ఉద్యమలాలో పాల్గొన్నామని చెప్పుకోవడానికి ప్రాధమిక అర్హత ఉన్నట్లే. ఆవిధంగా కల్వకుంట్ల కవిత “మనం అందరం ఉద్యమకారులమే,” అని సెల్ఫ్ సర్టిఫై చేసుకుంటుంటే, ఆమె వెనుకున్నవారు అవునవును అన్నట్లు తలలూపుతుంటారు.
అయితే కేసీఆర్‌ని, తెలంగాణ ఉద్యమాలపై బీఆర్ఎస్ పార్టీ నేతలకు మాత్రమే పేటెంట్ హక్కులు ఉన్నప్పుడు, ఇలా ఆమె కూడా క్లెయిమ్ చేసుకుంటే ఆ పార్టీ నేతలు, ప్రజలు అంగీకరిస్తారా? అంటే అంగీకరించకపోవచ్చు.
కానీ ప్రతీరోజు చెప్పిందే చెపుతూ ఉంటే క్రమంగా అదే నిజమని ప్రజలు నమ్ముతారని జాతిపితతోనే నిరూపితమైంది కదా? కల్వకుంట్ల కవిత కూడా అలాగే ప్రయత్నిస్తున్నట్లున్నారు. మంచిదే!
తెలంగాణ ఉద్యమంలో మన వీపులు విరిగేలా కొట్టిన సమైక్య ఆంధ్రులు…
ఇప్పుడు KCR పక్కన కూర్చుంటున్నారు.
–@RaoKavitha pic.twitter.com/l2D0QytPir
— M9 NEWS (@M9News_) February 12, 2026




