అధికారం నా ఒక్కడికే శాశ్వతం, పదవులు నాకే, ప్రభుత్వం నాదే, నేను చెప్పిందే చట్టం, నేను చేసిందే శాసనం అన్నట్టుగా వ్యవహరించిన వైసీపీ అధినేత వైస్ జగన్ కొమ్ములు విరిచారు, బిఆర్ఎస్ అధినేత నోరు నొక్కారు ఓటర్లు.
Also Read – ప్రకృతి విపత్తులకు ఎన్‌డీఆర్ఎఫ్, జగన్ విధ్వంసానికి…
పదేళ్ల అధికారం చేజారిపోతుందేమో అన్న భయంతో కావచ్చు, దశాబ్దం పాటు తెలంగాణలో చేసిన ఏకచక్రాధిపత్యంతో వచ్చిన మితిమీరిన ఆత్మ విశ్వాసం కావచ్చు పార్టీ పుట్టుకకు, వచ్చిన పదవులకు భీజం వేసిన ప్రాంతీయ వాదాన్ని విడిచి పార్టీ పేరును మార్చారు కేసీఆర్.
తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు నిలువెత్తు రూపంగా మారిన తెరాస ను బిఆర్ఎస్ గా మార్చి కేసీఆర్ తెలంగాణలో తన పార్టీకి తన చేతులతో తానే బ్రేకులు వేసుకున్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చలేని తన పార్టీ నాయకులను మార్చాల్సిన కేసీఆర్ వారిని మార్చకుండా పార్టీ పేరును మార్చి గులాబీ కింద ఉన్న ముళ్ళను తాకారు.
Also Read – అదే వైసీపీ, బిఆర్ఎస్ నేతలకు శ్రీరామ రక్ష!
కేసీఆర్ పరిస్థితి అలాఉంటే జగన్ విధానం మరోలా ఉంది. ఐదేళ్ల అధికారం తలకెక్కడంతో, ఇక ఏపీకి తానే శాశ్వత ముఖ్యమంత్రి, తన పార్టీకి తానే రాజు అనుకున్న జగన్ వైసీపీ కి ప్రతిబింబం గా ఉండే సాక్షి లోగోను మార్చారు. అప్పటి దాక తన తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మతో నడిచే సాక్షి నుండి వైస్సార్ బొమ్మను తొలగించారు జగన్.
వైస్సార్ విగ్రహాలతో రాజకీయం మొదలు పెట్టిన జగన్, అధికారం చేతికొచ్చే వరకు తండ్రి లేని బిడ్డ గా, తల్లి చెల్లిని వెంటేసుకుని, రాజన్న రాజ్యం అంటూ అంతటా రాజశేఖర్ రెడ్డి ఫొటోలతో నింపిన జగన్ అధికారం చేతికందగానే ముందుగా తల్లిని చెల్లిని రాష్ట్ర సరిహద్దులు దాటించారు.
Also Read – వైసీపీ గొంతులో విశాఖ ఉక్కు దిగిందిగా!
ఇక వై నాట్ 175 నినాదం అందుకోగానే తండ్రి వైస్సార్ బొమ్మను సాక్షి నుండి తొలగించారు. 30 ఏళ్ల పాటు తనదే అధికారం, తానూ నొక్కిన బటన్ల ప్రభావం ఆ స్థాయిలో ఉంటుంది అని తొందర పడిన కోయిల ముందే కూసింది అనేలా ఇక రాజశేఖర్ రెడ్డి ఆనవాళ్లు కూడా వైసీపీ లో ఉండకూడదు అనేలా సాక్షి నుండి వైస్సార్ బొమ్మను తొలగించి సాక్షి లోగోను మార్చేశారు వైస్ జగన్.
తండ్రి చావుని అడ్డుపెట్టుకుని రాజకీయం మొదలుపెట్టిన జగన్ తండ్రి విగ్రహాల ద్వారా 151 సీట్లతో ఎదిగి చివరికి అదే తండ్రి ఆనవాళ్లు తుడిచి 11 కి పడ్డారు. తెలంగాణ వాదంతో ఎదిగిన కేసీఆర్ తెలంగాణ అనే పదాన్ని పక్కన పెట్టారు, వైస్సార్ బొమ్మతో ఎదిగిన జగన్ ఆయన బొమ్మనే పక్క జరిపారు.
ఇదంతా కూడా అధికారం ఇచ్చిన అతి విశ్వాసం, వీరిద్దరూ కూడా దేనితో రాజకీయం మొదలు పెట్టారో, ఏ పేరు చెప్పుకుని ఎదిగారో ఇక దాని అవసరం ముగిసిందిలే అని భావించి దానినే పక్కన పెట్టారు. దీనితో ప్రజలు కూడా వీరిద్దరికి రాజకీయాలలో గెలుపోటములు ఎగిసిపడే కెరటాల వంటివని, ఎగిసిన ప్రతి కెరటం మళ్ళీ ఒడ్డును చేరాల్సిందే అని కళ్ళు తెరిపించారు.