KCR Doesn't Care Kavitha's Signals

స్కూల్లో టీచరుగా పనిచేస్తున్నంత వరకే ట్యూషన్లు లభించినట్లుగా, కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ పార్టీలో ఉన్నంత వరకే ఆమెకు పార్టీలో, బయట గౌరవ మర్యాదలు లభించేవి.

ఎప్పుడైతే ఆమె తిరుగుబాటు చేశారో అప్పటి నుంచి ఆమెను తండ్రి కేసీఆర్‌ పట్టించుకోవడం లేదు. కనుక బిఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో ఆమె తెలంగాణ రాజకీయాలలో అకస్మాత్తుగా ఒంటరి అయిపోయారు.

Also Read – గుడివాడ ఫ్లెక్సీ వివాదం..

తాను తండ్రికి లేఖ వ్రాసి, మీడియా ముందుకు వచ్చి మాట్లాడగానే వెంటనే తనతో రాజీకి ప్రయత్నిస్తారని అపోహ పడటం వల్లనే ఈవిదంగా జరిగిందని చెప్పవచ్చు.

కనుక ‘తెలంగాణ జాగృతి’ని మళ్ళీ యాక్టివ్‌ చేసుకొని తండ్రికి, అన్నకి తన తడాఖా చూపించాలనుకున్నారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

Also Read – ఒకరు సస్పెండ్.. మరొకరు సస్పెన్స్.. అయినా తీరు మారలే!

కనుక ఆమె తండ్రితో రాజీ పడేందుకు సిద్దపడి ఇటీవల భర్తతో కలిసి కేసీఆర్‌ని పరామర్శించడానికి ఫామ్‌హౌస్‌కి వెళ్ళారు. కానీ కేసీఆర్‌ కూతురు, అల్లుడిని పట్టించుకోకుండా పార్టీ నేతలతో కలిసి బయటకు వెళ్ళిపోయారు.

ఇది ఆమెకు చాలా అవమానమే కానీ రాజకీయాలలో కొనసాగాలనుకుంటున్నారు కనుక మౌనంగా దిగమింగక తప్పలేదు.

Also Read – కోటా శ్రీనివాసరావు ఇక లేరు

కేసీఆర్‌ని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు అన్న కేటీఆర్‌ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎఫ్-1 రేసింగ్ కేసులో అన్నని విచారణకు పిలవడాన్ని ఆమె తప్పు పడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. మీడియా ముందుకు వచ్చి ఖండించారు.

బహుశః కేటీఆర్‌ చెల్లి బాధని అర్దం చేసుకునే ఉంటారు. కానీ ఆమె “కేసీఆర్‌ తప్ప మరెవరి నాయకత్వంలో పనిచేయనని” తెగేసి చెప్పారు. కనుక కేటీఆర్‌ కూడా ఆమెని ఆదరించేందుకు ఇష్టపడటం లేదు.

అయితే ఆమె తండ్రిని, అన్నని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, “ఎఫ్-1 రేసింగ్ కేసులో అంతా పారాదర్శకంగానే జరిగింది. కనుక ఏసీబీ అధికారులు వద్ద కేటీఆర్‌ని ప్రశ్నించేందుకు ఏమీ లేవు. మళ్ళీ అవే ప్రశ్నలు అడుగుతారు. అదో టైమ్ పాస్ విచారణ మాత్రమే.

బనకచర్ల ప్రాజెక్టుపై బిఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తుంది. ఆ ప్రాజెక్టులో భాగంగా ఏపీ ప్రభుత్వం నేను నల్లమల అడవులలో తవ్వకాలు జరుపబోతోంది. నేను దానిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తాను,” అని అన్నారు.

అంటే తాను ఎప్పటిలాగే బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాన్నట్లు కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్నారని అర్దమవుతూనే ఉంది. కానీ ఆమె పంపుతున్న సిగ్నల్స్ కేసీఆర్‌ పట్టించుకోవడం లేదు. కానీ ఆమెకు వేరే దారి లేదు కనుక అటునుంచి రిప్లై వచ్చే వరకు సిగ్నల్స్ పంపిస్తూనే ఉండాలి.. తప్పదు.