ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వంపై తెదేపా, వైకాపా సభ్యులు అవిశ్వాస నోటీసు ఇవ్వడం, తెరాస ఎంపీలు రిజర్వేషన్ల పోరాటం, అలాగే కావేరి జల బోర్డు ఏర్పాటుకు అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేస్తుండటంతో గత కొన్ని రోజులుగా పార్లమెంట్ ఉభయ సభలు స్తంభించిపోతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా, విభజన హామీలపై తెదేపా, వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకపోవడంతో తెరాసపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ అంశంపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ఎంపీలతో ప్రగతిభవన్ లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ వెల్ లోకి వెళ్ళకుండా తమ నిరాశనే తెలియజేయాలని కేసీఆర్ నిర్ణయించారు.
దీనితో ఒక్క ఐఏడీఎంకే కూడా సహకరిస్తే బహుశా కేంద్రప్రభుత్వం అవిశ్వాసం ఎదురుకోక తప్పదు. అయితే జయలలిత మరణానంతరం ఆ పార్టీ పూర్తిగా బీజేపీ తొత్తుగా మారిపోయింది. దీనితో వారు ఏ మాత్రం సహకరిస్తారో చూడాలి. రేపు టీడీపీ, వైకాపాల అవిశ్వాసతీర్మానాలతో పాటు కాంగ్రెస్, సీపీఐ కూడా అవిశ్వాసతీర్మానాలు ఇచ్చాయి.



