బుడమేరు వాగు విషయంలో జగన్ ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం వలన వాగు పరీవాహక ప్రాంతాలను ముంచెత్తిందని టిడిపి కూటమి ప్రభుత్వం వాదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వమే కాదు వైసీపి కుటుంబం కూడా ఈ పాపంలో భాగస్వాములే అని టిడిపి తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస రావు చెప్పారు.
కానీ ఈ కధ 5 ఏళ్ళ క్రితం కాదు… 1956లోనే మొదలైందని చెపుతూ ఆ వివరాలను సాక్ష్యాధారాలతో సహా వెల్లడించారు.
బుడమేరు పొంగితే డెల్టాలో పంటలు, ఇళ్ళు మునిగి రైతులు నష్టపోకుండా ఉండేందుకు 1956, ఏప్రిల్ 11వ తేదీన అప్పటి కాంగ్రెస్ ఎంపీ అల్లూరి సత్యనారాయణరాజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి బుడమేరు డైవర్షన్ ప్రాజెక్ట్ నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే కొలికిపూడి ఆ శిలా ఫలకాన్ని, ఆ ప్రాజెక్ట్ వివరాలను తెలియజేస్తూ పెట్టిన బోర్డుని చూపించారు.
ఈ డైవర్షన్ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా డెల్టా ప్రాంతాలలో వరద ముంపు నివారించడమే కాకుండా, జిల్లా పశ్చిమలో మెట్ట ప్రాంతలైన జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు నియోజకవర్గాలకు త్రాగు, సాగు నీటిని అందించవచ్చని భావించారు.
అటు మైలవరం వద్ద గణపవరం కొండల వద్ద నుంచి ఇటు అనంతవరం కొండల వరకు సుమారు 5 కిమీ విస్తీర్ణంలో భారీ బ్యారేజీ నిర్మించాలని ప్లాన్ చేశారు. ఒకవేళ నిర్మించి ఉండి ఉంటే దానిలో ప్రకాశం బ్యారేజి కంటే 10 రెట్లునీళ్ళు నిలువ చేయగలిగేవారు.
ఈ డైవర్షన్ ప్రాజెక్టులో భాగంగా దానిని నిర్మించి ఉండి ఉంటే కృష్ణా మెట్ట ప్రాంతాలకు త్రాగు, సాగునీటికి ఎన్నడూ కరువు ఉండేదే కాదు.
కానీ అప్పట్లో గణపవరం జమీందార్ బొల్లారెడ్డి కోటిరెడ్డి, ఆయన కుమారుడు బొల్లారెడ్డి వేంకటేశ్వర రెడ్డి అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డితో ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని ఈ బ్యారేజీ కట్టకుండా అడ్డుకున్నారు.
బొల్లారెడ్డి వేంకటేశ్వర రెడ్డి ఎవరంటే జగన్ తాత వైఎస్ రాజారెడ్డికి స్వయాన్న వియ్యంకుడు. అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి విమలా రెడ్డి మావగారు. ఆనాడు వైఎస్ కుటుంబం దానిని అడ్డుకోకపోయి ఉంటే నేడు బుడమేరు ఎంత పొంగి ప్రవహించినా గండ్లు పడేవి కావు. నగరాన్ని ముంచెత్తేవి కావు.
బుడమేరులోకి వచ్చిననీరు వచ్చిన్నట్లు ఆ రిజర్వాయర్‌లోకి దాని నుంచి మెట్ట ప్రాంతాలు వెళ్ళిపోతుండేది. కనుక బుడమేరు పాపం జగన్ ఒక్కడిదే కాదు వైఎస్ కుటుంబంలో అందరిదీ,” అని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస రావు అన్నారు.
సోషల్ మీడియాలో ఆయన పెట్టిన ఈ వీడియో చూస్తే మరింత బాగా అర్దమవుతుంది.
దీనిని చరిత్ర పుటల్లో నుండి తవ్వితీశాడు మన కొలికిపూడి శ్రీనివాస రావు. @rao_kolikapudi గారికి ధన్యవాదాలు pic.twitter.com/NS8uzLI29L
— (@dmuppavarapu) September 7, 2024




