KTR Chandrababu Naidu

ఏపీలో జగన్, తెలంగాణలో కేటీఆర్‌ ఇద్దరూ ఇంచుమించు ఒకేలా వరదరాజకీయాలు చేస్తున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో సిఎం చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని ఇక్కడ జగన్, అక్కడ రేవంత్‌ రెడ్డి విఫలమయ్యారని కేటీఆర్‌ విమర్శలు గుప్పిస్తున్నారు.

అదే… తాము అధికారంలో ఉండి ఉంటే అసలు ఇంత భారీ వర్షాలని పడనిచ్చేవారిమే కాదు… వరదలు రానిచ్చేవారమే కాదన్నట్లు ఇద్దరూ మాట్లాడుతున్నారు. కానీ ఇదివరకు వరదలు వచ్చి హైదరాబాద్‌ మునిగిపోయారు. ఆ ప్రవాహంలో పలువురు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.

Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?

అదే సమయంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముంచుకు రావడంతో హైదరాబాద్‌లో వరద బాధిత కుటుంబాలకు రూ.10,000 చొప్పున పంచి ఎన్నికలు పూర్తవగానే ఆపేసిన సంగతి మరిచిపోయిన్నట్లు కేటీఆర్‌ తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డిని దుయ్యబడుతున్నారు.

అయితే రేవంత్‌ రెడ్డిని విమర్శించే హడావుడిలో తమ బద్దశత్రువైన చంద్రబాబు నాయుడుని పొగిడేస్తున్నామనే సంగతి కేటీఆర్‌ మరిచిపోవడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలని తక్కువ చేసి చూపే ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వం పనితీరుని మెచ్చుకుంటున్నట్లుగా కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Also Read – HIT 3: అడివి శేష్ ఫైట్ సీన్ లీక్‌తో సర్‌ప్రైజ్!

ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆరు హెలికాఫ్టర్లు, 150 మరబోట్లు రప్పించి సహాయ చర్యలు చేపడుతుంటే, మన తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ఎన్ని హెలికాఫ్టర్లు, బోట్లు రప్పించి ఎంతమంది ప్రాణాలు కాపాడారో తెలుసా?బిగ్‌ జీరో,” అని ట్వీట్‌ చేశారు.

జగన్‌ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెడితే వ్యంగ్యంగా స్పందించిన కేటీఆర్‌, ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు పనితీరుని మెచ్చుకుంటూ ట్వీట్‌ చేయడం విశేషమే కదా?చంద్రబాబు నాయుడుని జగనంత సమానంగా ద్వేషించే బిఆర్ఎస్ పార్టీ కూడా మెచ్చుకుంటుంటే, జగన్‌ మాత్రం చంద్రబాబు నాయుడు విఫలం చెందారని విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పనితీరు బాగుందో లేదో గ్రహించడానికి కేటీఆర్‌ ట్వీట్‌ ఓ చిన్న ఉదాహరణ సరిపోదూ? జగన్‌ దానినీ చూడకపోతే ఎలా?

Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!