వరద బాధితులకు మరో ఊరట..!

LG Electronics

విజయవాడలో వరదలు సృష్టించిన విధ్వంసం ఇంతా అంతా కాదనే చెప్పాలి. రహదారులు వాగులయ్యాయి, కొన్ని కాలనీలు సరస్సులుగా మారిపోయాయి, మరికొన్ని ప్రాంతాలలో వరద తీవ్రత నదీ ప్రవాహన్ని తలపించింది. అయితే ఈ వరద తెచ్చిన బురదతో వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు తీవ్రంగా ఆస్తి నష్టం వాటిల్లింది.

పార్కింగ్ లో ఉన్న బైకులు, కారులు మొదలుకుని ఇంటి లోపల ఉండే టీవీ లు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషిన్స్, ఏసీ లు వంటి అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగానో, పాక్షికంగానో పాడైపోయాయి. అయితే బైకులు, కార్లు వంటి వాహనాలకు సంబందించిన ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఈ వరద విపత్తుకి సదరు వాహనాలకు ఇన్సూరెన్స్ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటానని బాబు హామీ ఇచ్చారు.

ADVERTISEMENT

ఆ దిశగా కూడా అడుగులు వేస్తుంది అప్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ముందుగా ఇంట్లో ఉండే గృహ సదుపాయాలను మెరుగు పరచడానికి ఎలక్ట్రానిక్ కంపనీలు ముందుకు రావాలంటూ బాబు పిలుపిచ్చారు. అయితే ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేర LG ఎలక్ట్రానిక్స్ స్పందించింది.

వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఉచితంగా సేవలు అందించేందుకు LG ఎలక్ట్రానిక్స్ ముందుకొచ్చింది. LG ఎలక్ట్రానిక్స్ పరికరాలకు ఉచితంగా సర్వీస్ అందిస్తామని, పాడైపోయిన స్పెర్ పార్ట్ లపైనా 50%డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది LG. దీనితో వరద బాధితులకు కొంత మేర ఉపశమనం లభించినట్లయింది.

LG ఎలక్ట్రానిక్స్ తో పాటుగా మిగిలిన కంపనీల వారు కూడా మానవత్వంతో ముందుకొచ్చి వరద బాధితులకు అండగా నిలవాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. ఇన్నాళ్లు వ్యాపార ధోరణిలో లాభాపేక్షతో ఉన్న సంస్థలు కూడా ఇప్పుడు చేయుట కోసం తమ ఆపన్న హస్తాన్ని అందించడం నిజంగా అభినందనీయం.

డబ్బులు ఊరికే రావు అంటూ నిత్యం మీడియాలో హడావుడి చేసే లలితా జ్యులరీస్ యజమాని కిరణ్ కుమార్ కూడా తన వంతు బాధ్యతగా వరద బాధితుల సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ఆయన చేతికి చెక్ అందించారు. దీనితో కిరణ్ ను అభినందించారు సీఎం బాబు.

ADVERTISEMENT
Latest Stories