LuLu Group in Visakhapatnam

జగన్‌ హయంలో ఎక్కువగా వినిపించిన పదాలు బటన్ నొక్కడం, మేలు చేయడం, సంక్షేమ పధకాలు కాగా అప్పుడూ, ఇప్పుడూ చంద్రబాబు నాయుడు హయంలో ఎక్కువగా వినిపించే పదాలు అభివృద్ధి, పెట్టుబడులు, ఐటీ కంపెనీలు, టెక్నాలజీ. ఈ చిన్న ఉదాహరణ చాలు ఇద్దరి ఆలోచనావిధానం, పాలన ఏవిదంగా ఉన్నాయో అర్దం చేసుకునేందుకు.

విశాఖ నుంచి తాము తరిమేసిన ‘లులు గ్రూప్’ని సిఎం చంద్రబాబు నాయుడు తిరిగి తీసుకువస్తుండటం వైసీపీ నేతలు జీర్ణించుకోవడం కష్టమే. లులు గ్రూప్ విశాఖకి వస్తే తప్పకుండా జగన్‌ ప్రభుత్వ నిర్వాకంపై మరింత చర్చ జరుగుతుందని, ప్రజలలో తమపట్ల వ్యతిరేకత పెరుగుతుందనే భయంతోనే వైసీపీ నేతలు ఈ ఒప్పందం గురించి నోటికి వచ్చిన్నట్లు వాగుతున్నారని భావించవచ్చు.

Also Read – మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా?

‘లులు గ్రూప్’ రాష్ట్రంలో వెయ్యి కోట్లు పైన పెట్టుబడిపెడుతుంది. హైపర్ మార్కెట్‌ నిర్మించిన తర్వాత ఏడాదికి ఎకరానికి సుమారు రూ.50 లక్షలు పైనే ప్రభుత్వానికి చెల్లిస్తుంది. దాని అమ్మకాల పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, దానిలో సుమారు 1,000 మందికి పైగా ఉద్యోగాలు, దాని వలన స్థానిక రైతులు, ఉత్పత్తిదారులకు లభించే మార్కెటింగ్, ఉపాధి అవకాశాలు వంటివన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని చూసి అప్పుడే దానికి అంత ఖరీదైన భూమి అంత సుదీర్గ కాలానికి లీజుకి ఇవ్వడం సరైన నిర్ణయమా కాదా అని మాట్లాడాలి.

విశాఖలో రుషికొండపై పర్యాటక శాఖకి చెందిన డజన్ల కొద్దీ భవనాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేసి, పచ్చటి కొందని పెద్ద మట్టి డిబబాగా మార్చేసి, ఎటువంటి అనుమతులు తీసుకోకుండా జగన్‌ తన కోసం రూ.500 కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన ప్యాలస్‌లు కట్టుకున్నప్పుడు, నేడు చంద్రబాబు నాయుడు నిర్ణయాలను ప్రశ్నిస్తున్న బొత్స సత్యనారాయణ, వైసీపీ మంత్రులు ఎవరూ కూడా అది తప్పని ధైర్యంగా చెప్పలేకపోయారు. నేటికీ చెప్పలేకపోతున్నారు.

Also Read – గంట అరగంట వీరులకు అర్దమైంది కానీ దువ్వాడకు అర్ధం కాలే.. అందుకే..


కానీ విశాఖ నగరానికి ఓ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ వస్తుంటే, వైసీపీ నేతలందరూ ఏదో అనర్ధం జరిగిపోతోందన్నట్లు మాట్లాడుతుండటం సిగ్గుచేటు.. కాదా?