Lulu Mall Back To Andhra Pradesh

అయిదేళ్లుగా అలిసి సొలసిన బతుకులు… నాలుగేళ్లుగా నయా పైసా పెట్టుబడి లేని రాష్ట్రం… చివరికి మూడు పార్టీల కలయికతో… అహంకారమే పరమావధిగా అహంకారాన్ని ప్రదర్శించిన పార్టీని రెండు అంకెలకు పరిమితం చేసి… గద్దె ఎక్కిన ఒక్క ఏడాది లోపే గత వైభవాన్ని చాటిచెప్పే విధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రస్థానం సాగుతోంది.

Also Read – సొంత మీడియాలో డప్పు కొట్టుకుంటే చాలా?

సవాళ్ళతో కూడుకున్న బాధ్యతలను భుజాన వేసుకున్న చంద్రబాబుకు ఆదిలోనే ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. రూపాయి లేకుండా చేసిన ఖజానాలు స్వాగతం పలుకగా, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే ఘనంగా చెప్పుకునే పరిస్థితికి రాష్ట్ర స్థితిగతులను జగన్ తీసుకువచ్చారు.

2019 మొదలుకుని ఏ విభాగంలోనూ కించిత్ అయినా అభివృద్ధి జరగకపోగా, ఖజానాలోని ‘కాకి లెక్కలు’ కూటమి ప్రభుత్వానికి కానుకగా వచ్చాయి. వాటిని గాడిలో పెట్టే లోపే రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. కనీవినీ ఎరుగని రీతిలో పోటెత్తిన కృష్ణమ్మ, బుడమేరుల ప్రభావం రాష్ట్రమంతా పాకింది.

Also Read – రాజకీయాలలోకి షాయాజీ షిండే… ఎమ్మెల్యే అనిపించుకుంటే చాలట!

ఓ వైపు చిన్నాభిన్నం చేసిన వ్యవస్థలను చేస్తున్న ప్రయత్నాలు అలాగే ఉండగా, మరో వైపు ప్రకృతి ప్రకోపం ముఖ్యమంత్రిగా చంద్రబాబుని సుడిగుండాల్లోకి నెట్టింది. ఇక్కడే ఓ నాయకుడిగా తనకున్న అపార అనుభవం, కష్టాలను చూసి అధైర్య పడని మొక్కవోని దీక్ష రాష్ట్ర ప్రజలకు మరోసారి ప్రస్పుటంగా దర్శనమిచ్చాయి.

“సమస్యలను అవకాశాలుగా తీసుకుని ఒక్కో మెట్టు ఎదగాలి” అని ప్రతిసారీ ఉచ్చరించే చంద్రబాబు, అదే బాటను అనుసరిస్తూ రేయి, పగలు అన్న తేడా లేకుండా రాష్ట్రాన్ని ప్రకృతి విపత్తు నుండి బయట పడేశారు. మునుపెన్నడూ లేని రీతిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి కొన్ని వందల కోట్ల రూపాయలు విరాళాలు వచ్చిపడ్డాయంటే, చంద్రబాబు మీద ఉన్న నమ్మకాన్ని చాటిచెప్తుంది.

Also Read – ఆహా అనిపించిన బాలయ్య అన్ స్టాపబుల్…!

అలా మొదలైన పరంపరలో ‘బాబు అండ్ కో’ పెట్టుబడులకు శ్రీకారం చుట్టారు. 2014-2019 హయాంలో చంద్రబాబుతో ఒప్పందం కుదుర్చుకున్న ‘లూలు’ గ్రూప్, జగన్ రాకతో ‘దండం’ పెట్టి వదిలిపోయిన వైనం తెలిసిందే. 2019-2024 నడుమ ఇలాంటి కధలకు కొరవలేదనే విధంగా జగన్ తన పాలనను నిరవధికంగా కొనసాగించారు.

అలా రాష్ట్రం విడిచి వెళ్ళిపోయిన వారికి కూడా అభయమిస్తూ, మళ్ళీ రాష్ట్రంలోకి పెట్టుబడులు రప్పించడమంటే బహుశా బాబు వలనే సాధ్యమవుతుందని చెప్పకతప్పదు. ‘రాష్ట్రంలోకి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తే, భయపడిపోతున్నారు’ అని స్వయంగా చంద్రబాబే సెలవిచ్చిన వైనం నుండి అదే పెట్టుబడిదారులను ఒప్పించి మళ్ళీ రాష్ట్రంలోకి అడుగు పెట్టేలా చేశారు.

ఈ వైనమే “దటీజ్ బాబు” అని ప్రశంసించేలా చేసిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. 40 ఏళ్ల నాటి టీడీపీకి సహజంగానే లక్షల సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు ఉంటారు. “దటీజ్ బాబు” లాంటి సోషల్ మీడియా క్యాంపైన్స్ కు వీరు దోహదం చేస్తుంటారు. ఇవన్నీ రాజకీయ పార్టీలకు, నాయకులకు సర్వ సహజం.




కానీ 2024లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి పరిస్థితులు వేరు. ముక్కలైన రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నిలిపేందుకు తన సర్వశక్తులు ఒడ్డుతున్నా, జగన్ అలాంటి అవరోధకులు అడుగడుగునా వెనక్కి లాగుతూనే ఉన్నారు. భావి తరాల భవిష్యత్తు కోసం ఏడు పదుల వయసులోనూ జగన్ లాంటి వారిని ఎదిరించి, తాను తలపెట్టిన కార్యాన్ని కొనసాగిస్తున్న చంద్రబాబును “దటీజ్ బాబు” అని గర్వంగా పలకడంలో తప్పులేదేమో!