సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోన్న రానా “ఘాజీ” చిత్రానికి, ఇటీవల కాలంలో ఏ చిత్రానికి రానంత మద్దతు సినీ విమర్శకుల నుండి వ్యక్తమయ్యింది. అలాగే ఈ సినిమాను వీక్షించిన పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ, చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ జాబితాలో ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఉన్నారన్న విషయాన్ని, చిత్ర సినిమాటోగ్రాఫర్ మదీ తాజాగా చెప్పుకొచ్చారు.
ఈ సినిమా సక్సెస్ తెలుసుకుని మహేష్ బాబు తనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారని, అంతకు మించిన మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ సినిమాను ఏ భాషలో చూస్తే నిజమైన అనుభూతి కలుగుతుందని మహేష్ తనను అడిగారని, తానూ మరో మాట లేకుండా ‘తెలుగులోనే’ అని చెప్పానని, ఈ ‘శ్రీమంతుడు’ ఫోటోగ్రాఫర్ చెప్పుకొచ్చారు. మార్చిలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ప్రభాస్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తన భవిష్యత్తు సినిమాల గురించి చెప్పారు మదీ.



