మహేష్ భయపడి వద్దన్నాడు!

Mahesh Babu - Chennaiపూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన రెండు సినిమాలు “పోకిరి, బిజినెస్ మెన్” సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ సిద్ధమవుతున్నాయని గతంలో ఒకటి, రెండు సందర్భాలలో స్వయంగా పూరీ జగన్నాధ్ ప్రకటించారు. ముఖ్యంగా ‘బిజినెస్ మెన్’ విషయంలో అయితే, సినిమా ఎండింగ్ లో సీక్వెల్ ఉంటుందన్న సంకేతాలను స్పష్టంగా ఇచ్చేసారు.

మరి అంతటి సూపర్ హిట్ కొట్టిన రెండు సినిమాలకు ఎందుకు సీక్వెల్స్ రాలేకపోయాయి? అంటే మహేష్ బాబే కారణం అంటున్నారు దర్శకుడు పూరీ జగన్నాధ్. తాజాగా ‘ఇజం’ ప్రమోషన్స్ లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు పూరీ. వాస్తవానికి ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్ చేద్దామని అంటే, మహేషే భయపడి వద్దన్నాడని పూరీ చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులు కొట్టిన ‘పోకిరి’కి సీక్వెల్ అంటే మహేష్ ఏంటి… ఏ హీరో అయినా భయపడక తప్పదు. అందులోనూ ‘పోకిరి’ సినిమానే అటు తిప్పి, ఇటు తిప్పి ‘గోలీమార్’ రూపంలో అందించిన పూరీ కధలన్నీ గ్యాంగ్ స్టర్ల చుట్టే తిరుగుతున్నాయన్న విమర్శ కూడా ఉంది. అయినా మహేష్ కాదన్నా… పూరీ తను రాసుకున్న కధను వదిలిపెట్టడు కదా..! బహుశా ఏ హీరో కూడా ముందుకు రాలేదా..!

ADVERTISEMENT
Latest Stories