ysrcp-for-reddys-of-reddys-by-reddys

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి టీడీపీ తన సోషల్ మీడియా లో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టింది. “ఫర్నిచర్ దొంగ దొరికిపోయాడు” అంటూ హై లైట్ చేస్తూ లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన జగన్ కి ప్రజల సొమ్ము మీద ఇంకా మోజు తీరలేదు.

అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని సచివాలయ ఫర్నిచర్ తో నింపేసాడు. పదవి ఊడిపోయాక 39 లక్షల విలువైన ఆ ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలి కదా.! అయినా ఇవ్వలేదు. ఇక ఇలాంటి వాడిని ఏమనాలి.? అంటూ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం ఫోటోలను పోస్ట్ చేసారు.

Also Read – జగన్‌ని అడ్డుకోవాలంటే విభీషణులు అవసరమే

నిన్న పార్టీ నేతలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ సమావేశం ఏర్పాటు చేసిన ఫోటోలను వైసీపీ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. పార్టీ నేతలకు జగనన్న ఆత్మ స్తైర్యాన్ని నింపుతున్నారు అంటూ గర్వంతో పోస్టు చేసిన ఈ ఫోటోనే జగన్ ను ప్రజల ముందు ‘దొంగ’గా నిలబెడుతుంది అని బహుశా వైసీపీ నేతలు పైగా గ్రహించి ఉండకపోవచ్చు.

అయితే అధికారం ఉన్నప్పుడు తానూ చేసిన పాపాలు తిరిగి తననే చేరుతాయి అని ఊహించని జగన్ ఇప్పుడు ఈ ఫర్నిచర్ దొంగ అనే నిందను మోయక తప్పలేదు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే అప్పటి మాజీ అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన టీడీపీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద్ పై ఫర్నిచర్ దొంగ అంటూ నిందలు మోపి ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చెరుపుకోలేని ముద్ర వేశారు జగన్.

Also Read – అమ్మ అందరికీ అమ్మే కానీ ఎవరి తల్లి వారిదే!

ఆ అవమాన భారం మోయలేక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ‘మూడు నెలలకే’ ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. జగన్ కు చేసిన పాపం నీడలా వెంటాడిందా అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన ‘మూడు వారాలకే’ జగన్ అదే ‘ఫర్నిచర్ దొంగ’ అనే నిందను మోస్తున్నారు. దీనితో కోడెల అభిమానులు కాలం జగన్ కు మంచి రిటర్న్ గిఫ్ ఇచ్చింది, కోడెల ఆత్మ ఇప్పుడు శాంతిస్తుందన్నారు.

కోడెల శివ ప్రసాద్ కు వైసీపీ ప్రభుత్వం సంజాయిషీ చెప్పే అవకాశం కానీ సమయం కానీ ఇవ్వకుండా దొంగా దొంగా అంటూ పదేపదే మానసికంగా క్రుంగ తీయడంతో ఆయన ఇక తన రాజకీయ జీవితాన్నే కాదు ప్రాణాలను కూడా వదులుకున్నారు. దీనితో ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం, ఆయన శేష జీవితం ఒక అపవాదతో ముగించాల్సి వచ్చిందే అని ప్రతి టీడీపీ కార్యకర్త ఆవేదన చెందారు.

Also Read – సినీ పరిశ్రమకు ఏపీ ఒక ఆదాయ వనరేనా.?

అయితే ఈ రోజు టీడీపీ పెట్టిన ఈ పోస్టును సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ “ఫర్నిచర్ దొంగ”…ఈ మాట ఎప్పుడో ఎక్కడో అన్నట్టుందా.? లేక విన్నట్టుందా.? అంటూ టీడీపీ, జనసేన మద్దతుదారులు అటు జగన్ ను ఇటు వైసీపీ ని ట్రోల్ చేస్తూ కోడెలను గుర్తు చేసుకుంటున్నారు.