పవన్ కళ్యాణ్ ‘వేస్ట్’ అన్న రోజా!

MLA Roja Comments on Pawan Kalyan‘జనసేన’ పార్టీని స్థాపించి ఇంతకాలం అయినా… ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సాధించిందేమిటని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. కేంద్రంలో మోడీకి, రాష్ట్రంలో చంద్రబాబుకు జై కొడుతూ… ఏదైనా తప్పు జరిగితే తాను ప్రశ్నిస్తానంటూ చెప్పిన పవన్… సైలెంట్ గా కూర్చున్నారని అన్నారు. పార్టీ స్థాపించినప్పటికీ ఇప్పటి వరకు ఒక ఎన్నికలో కూడా పోటీ చేయలేదని విమర్శించారు.

ADVERTISEMENT

పవన్ కళ్యాణ్ కన్నా ఆయన సోదరుడు చిరంజీవే ఉత్తమమని… ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, ఎన్నికల్లో పోటీ చేసి, కొన్ని స్థానాల్లో గెలుపొందారని అన్నారు. రాజకీయాలకు పవన్ కళ్యాణ్ కొత్త కాదని… పార్టీ స్థాపించి ఇంతకాలమైనా ఏమీ సాధించలేని పవన్… రానున్న ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేరని తాజాగా ఇచ్చిన ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో రోజా పేర్కొన్నారు.

ADVERTISEMENT
Latest Stories