
ఐపీఎల్ అనే టోర్నీ మొదలయ్యి ఇప్పటికే 17 సీజన్లు పూర్తి చేసుకున్నప్పటికీ, టక్కున ఐపీఎల్ లో బెస్ట్ ఫినిషర్ ఎవరు అంటే అందరి నోటా వచ్చే మాట- ‘మహేంద్ర సింగ్ ధోని’. మరి అప్పట్లో ఈయన ఫినిషింగ్ ఆ స్థాయిలో ఉండేది. స్కోరు ఎంతైనా ఉండని, ముందు తన వికెట్ను కాపాడుకుని, చివరి 2 -3 ఓవర్లలో మ్యాచ్ ను గెలిపించేవాడు అప్పటి ధోని.
ఈ 17 ఏళ్ళ తన చరిత్ర లో ఎంతో మంది ఫినిషేర్స్ ను చూసింది ఐపీఎల్. ఆర్.సి.బీ నుండి ఏ.బీ.డీ, ముంబై నుండి పొల్లార్డ్, హార్దిక్, కోల్కతా నుండి రస్సెల్, ఇంకా మిల్లర్, రోహిత్, విరాట్ వంటి వారు కూడా చివరి దాకా నిలబడి మ్యాచ్ లను ఒంటి చేతి మీద నిలబెట్టిన సందర్భాలు కోకొల్లు.
Also Read – సుబ్బారెడ్డి vs సాయి రెడ్డి…
అయినా కూడా, ధోని నే బెస్ట్ ఫినిషర్ అంటారు. ఎందుకంటే ఆయన ఒకప్పటి బ్యాటింగ్
స్టైల్ అంటువంటిది మరి. చాల సునాయాసంగా బాల్ ను బౌండరీ తీరాలను దాటించేవారు. తన మార్క్ హిట్టింగ్ హెలికాఫ్టర్ షాట్ తో ప్రత్యర్థి బౌలర్లకు హీట్ పెంచేవాడు ఎం.ఎస్. ధోని.
కానీ, 2020 లో ఆయన ఇంటెర్నేష్నల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుండి అతని బ్యాటింగ్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పటం లో సందేహమే లేదు. గత 5 ఏళ్లుగా ధోని ఫినిష్ చేసిన మ్యాచ్ లు టక్కున చెప్పమంటే అందరూ ఆలోచనలో పడతారు. కొన్ని గణాంకాలు వింటే ఇదంతా జరిగింది ధోని ఉన్న జట్టు లో నేనా అని సందేహం రాకమానదు.
Also Read – వైసీపీకి గమనిక: డీఎస్సీ అంటే ఉద్యోగాల భర్తీకి!
గత 4 ఏళ్లగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 175 లేదా ఎక్కువ పరుగులను ఒక్కసారి కూడా విజయవంతంగా చేధించలేకపోయారు. ఇది వింటే ప్రతి చెన్నై జట్టు అభిమాని ఒకప్పటి ధోని ను గుర్తుకు తెచ్చుకుంటూ బాధ పడుతున్నారు. ఈ గడిచిన 17 ఏళ్ళల్లో చెన్నై జట్టుకు మరొక ఫినిషర్ ను వెతకావాల్సిన అవసరం రాలేదు, కానీ, పరిస్థితులు చూస్తుంటే వారు ఒక కొత్త ఫినిషర్ కోసం వెతుక్కోవాల్సి వస్తుందేమో.
కేవలం ఫినిషింగ్ ఏ కాదు, ఒకప్పుడు చెన్నై మిడిల్ ఆర్డర్ లో చెన్నై బ్యాటింగ్ కు వెన్నుముకగా నిలిచారు ‘సురేష్ రైనా’. ఇప్పటి చెన్నై మిడిల్ ఆర్డర్ నిరాశపరుస్తున్న ప్రతిసారి చెన్నై అభిమానులు మరల రైనా ను స్మరించుకుంటున్నారు.
Also Read – సంగీతంలో లెజెండ్ – మీడియా అంటే ఆమడ దూరం. వివాదాల భయమా?
ఇలా గతంలో 5 ఐపీఎల్ కప్పులను సునాయాసంగా తన ఖాతాలో వేసుకున్న చెన్నై టీం ఇప్పుడు ఒక్క బలమైన గెలుపు కోసం చెమట చిందించాల్సి రావడం, అయినా ఫలితం లేకపోవడం ప్రతి CSK అభిమానిని కలవరపరుస్తోంది.
తన బ్యాటింగ్, విక్కీ కీపింగ్, కెప్టేన్సీ తో నాటి చెన్నై జట్టుకి బలమైన ఈ దిగ్గజ అంతర్జాతీయ ఆటగాడు నేడు తన పేలవమైన ఆటతీరుతో అదే చెన్నై జట్టుకి బలహీనతగా మారిందా అంటూ సోషల్ మీడియాలో ధోని ఆటతీరు పై పోస్టులు వెలుస్తున్నాయి.
అంతర్జాతీయ క్రికెట్ లో తనకున్న అనుభవాన్ని ఐపీఎల్ లో చెన్నై జట్టు కోసం వెచ్చించిన ధోని ఇప్పుడు అదే జట్టుకి భారమవుతున్నారా.? అంటూ వార్తలు రావడం సగటు ధోని అభిమానులను కలవరపరుస్తోంది.