వివాదాలకు దూరంగా ఉండే ప్రిన్స్ మహేష్ బాబును బ్లాక్ బస్టర్ “శ్రీమంతుడు” సినిమా తెగ ఇబ్బందులు పెడుతోంది. తన నవలను కాపీ కొట్టి ‘శ్రీమంతుడు’ సినిమా తీసారని శరత్ చంద్ర అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించగా, నాంపల్లి కోర్టు దర్శకనిర్మాతలతో హీరో మహేష్ బాబును కూడా కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అయితే తనకున్న షెడ్యూల్స్ రీత్యా వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని ప్రిన్స్ అర్జీ పెట్టుకోగా, తాజాగా నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది.
దీంతో తదుపరి విచారణలో ప్రిన్స్ తప్పక హాజరు కావాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ నిర్మాత నవీన్ కు మరోసారి సమన్లు జారీ చేసింది. అయితే మహేష్ ను ఈ విధంగా ఇబ్బంది పడడం ఇదే ప్రధమం కాదు. గతంలో ‘అర్జున్’ సినిమా పైరసీ విషయంలో, ఒక వ్యక్తిపై చేయి చేసుకుని, పైరసీ సిడిలను తగలబెట్టిన సందర్భంలో వరంగల్ కోర్టు చుట్టూ పలు మార్లు తిరిగిన విషయం తెలిసిందే. అయితే చివరకు ఆ కేసును కోర్టు కొట్టివేసిందనుకోండి… అది వేరే విషయం..! అయితే ఈ కేసు ఏమవుతుందో చూడాలి..!



